Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విలువ ఆధారిత ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పరిష్కారాలు అందిస్తున్న పెన్నార్ ఇండిస్టీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెండింతలై 97.19 శాతం వద్ధితో రూ.21.12 కోట్ల నికర లాభాలు సాధించింది. 2021-22 క్యూ3లో రూ.10.71 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఎబిటా 40.61 శాతం అధికమై రూ.66 కోట్లుగా ఉందని పెన్నార్ కార్పొరేట్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. కంపెనీ టర్నోవర్ 29.88 శాతం పెరిగి రూ.692.22 కోట్లను తాకిందని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో నికరలాభం రెండింతలకుపైగా పెరిగి 104.76 శాతం వద్ధితో రూ.51.58 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో టర్నోవర్ 41.53 శాతం ఎగసి రూ.2,226 కోట్లకు పెరిగింది.