Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతదేశంలో అగ్రగామి వినియోగదారుల సాంకేతిక బ్రాండ్లలో ఒకటైన పోకో తన తదుపరి X-సిరీస్ విడుదలను ప్రకటించింది. పోకో X5 ప్రో 5జి పరిశ్రమలో పలు మొట్టమొదటి ప్రత్యేకతలతో సిద్ధమైంది మరియు శక్తియుతమైన ఫీచర్లయిన స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసోసర్, 6.67’’ ఎక్స్ఫినిటీ అమోల్డ్ డిస్ప్లే, డాల్బి విజన్® మరియు డాల్బి అట్మాస్® సపోర్ట్ మరియు 108 ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది రెండు వేరియంట్లు 6జిబి+128 జిబి మరియు 8జిబి+256 జిబిలలో విడుదలైన పోకో X5 ప్రో 5జి వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 ధరను కలిగి ఉంది. ఇది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి వచ్చింది.
దీని విడుదల గురించి పోకో ఇండియా కంట్రీ హెడఖ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ, ‘‘పోకో X-సిరీస్‌లోని స్మార్ట్ఫోన్లు మార్కెట్లో ప్రతిసారీ ఉత్తమ సాధనను చూపించాయి మరియు అత్యంత అస్తవ్యస్థమైన వలయంలో కేంద్ర బిందువుగా మారడంలో విజయవంతం అయ్యాయి. పోకో X-సిరీస్ యథాస్థితికి సవాలు విసిరే మరియు ఒక దశ ఎత్తుకు తోడ్కొనివెళ్లే మా బ్రాండ్ గుర్తును ప్రతిబింబిస్తుంది. మేము 2021లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను 20కె కన్నా తక్కువ ధరలో తీసుకు రావడాన్ని సవాలుగా తీసుకున్నాము, అయితే పోకో తన పోకో X3 ప్రో ద్వారా దాన్ని అధిగమించాము. అనంతరం పోకో X4 ప్రో 5జి అపారమైన అప్గ్రేడ్లను తీసుకు వచ్చింది మరియు2022లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో 150కె యూనిట్ల విక్రయాలను చేసుకుంది’’ అని వివరించారు.
‘‘ఈ పరంపరను ముందుకు తోడ్కొని వెళ్లే దిశలో పోకో X5 ప్రో 5జి అత్యుత్తమ నాణ్యతతో కూడిన మనోరంజన మరియు పనితీరులో ఉన్నత కొలమానాలను కలిగి ఉండడమే కాకుండా ఫ్లాగ్షిప్ భావనను కలిగి ఉంది. పోకో X5 ప్రో ద్వారా మేము మా వినియోగదారులు మరియు అభిమానుల అవసరాలను పూర్తి చేస్తున్నాము. సరికొత్త పోకో X5 ప్రో 5జితో సంచనాలను సృష్టించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము’’ అనివివరించారు. పోకో X5 ప్రో 5జి ఈ వర్గంలో అత్యంత శక్తియుతమైన చిప్సెట్తో అందుబాటులోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 778జి ఆండ్రాయిడ్ 12తో పని చేస్తుంది. ఇది భారతదేశంలో ఎంఐయుఐ 14తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. ఆస్ట్రాల్ బ్లాక్, హారిజన్ బ్లూ మరియు పోకో ఎల్లోలలో అందుబాటులోకి వచ్చిన పోకో X5 ప్రో5జి 181 గ్రాముల తూకాన్ని కలిగి ఉంది మరియు 7.9 మి.మీ. మందంతో X-సిరీస్‌లో అత్యంత తేలికైన మరియు పల్చని పరికరంగా నిలిచింది. ఇందులో 6.67’ ఎక్స్ఫినిటీ డిస్ప్లేను అత్యంత పల్చని బెజెల్స్ కలిగి ఉన్న ఇది X-సిరీస్ శ్రేణిలో అసాధారణమైన మొట్టమొదటి అంశమైన డాల్బి విజన్® మద్దతుతో వినియోగదారుల అనుభవాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తోడ్కొని వెళ్లనుంది.
పోకో X5 ప్రో 5జి 108 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సర్లను కలిగిన భారతదేశపు మొదటి పోకో స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. దీనికి 8ఎంపి అల్ట్రా-వైడ్ స్నాపర్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సర్ కలిగి ఉంది. ఇది 8 ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సర్‌తో అత్యంత సూక్ష్మమైన డిటెయిల్స్‌తో విస్తృతమైన ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తుంది. కెమెరా సెటప్ పూర్తి చేయడం 16 ఎంపి స్నాపర్ ఇది సహజ రూపంలో సెల్ఫీలను అందించడం ద్వారా అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది. పోకో X5 ప్రో 5జి 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ ఛార్జింగ్‌లో అత్యంత కఠినమైన పనులను సరళం చేయగా, సులభంగా దీన్ని రోజంతా వినియోగించుకోవచ్చు. ఇందులోని 67 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ తగినంత శక్తి ఇస్తుండగా, ఇది కేవలం 45 నిమిషాలలో స్మార్ట్ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.