Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి పెద్ద ప్లాస్టిక్స్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్ ప్లాస్ట్‌ఇండియా 2023 , పదకొండవ ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు 3.60 లక్షల మంది సందర్శకులు విచ్చేశారు. ప్లాస్టిక్స్ పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఈ ప్రదర్శనలో 1800 మంది ఎగ్జిబిటర్లు తమ ప్రపంచశ్రేణి ప్రాసెసింగ్ మెషినరీ, ముడి పదార్థాలు, రీసైక్లింగ్ సాంకేతికత, తాజా ఆటోమేషన్ సాంకేతికతలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా అత్యున్నత స్ధాయి సీఈఓ కాంక్లేవ్ జరిగింది. దీనిలో గౌరవనీయ కేంద్ర రసాయన, ఎరువులు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖామాత్యులు మన్సుఖ్ భాయ్ మాండవీయ పాల్గొన్నారు. దాదాపు 90 మంది పరిశ్రమ నాయకులు, సీఈఓలు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతీయ ప్లాస్టిక్స్ పరిశ్రమ తన పూర్తి సామర్థ్యం ఏ విధంగా సంతరించుకోగలదో చర్చించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం విధాన నిర్ణేతలతో , పరిశ్రమ కలిసి పనిచేయాలని అంగీకరించారు. భారత ప్రభుత్వ రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అరుణ్ బరోకా కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ ప్రదర్శన విజయవంతంగా ముగిసిందని ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు జిగిష్ దోషీ వెల్లడిస్తూ ముడిపదార్ధాలు, మెషినరీ, ఫినిష్డ్ ఉత్పత్తులు సైతం ఒకే చోట ప్రదర్శించడం వల్ల ఎగ్జిబిటర్లు, సందర్శకులు ప్రయోజనం పొందారన్నారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తుందంటూ సరైన విధాన నిర్ణయ మద్దతు ఉంటే ప్లాస్టిక్స్ పరంగా త్వరలోనే ఇండియా అంతర్జాతీయ కేంద్రంగా నిలువనుందన్నారు. ప్లాస్ట్‌ఇండియా 2023 నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అజయ్ షా మాట్లాడుతూ ప్లాస్ట్ ఇండియా 2023 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రదర్శించిన సాంకేతికతలు, ఆవిష్కరణలు భవిష్యత్‌కు రోడ్‌మ్యాప్ వేశాయన్నారు.