Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంఫియన్‌షిప్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి ఇటాలియన్ తయారీదారు, మసెరాటి ఇప్పుడు హైదరాబాద్‌లో రేస్ కోసం పూర్తిగా సన్నద్ధమైంది. మసెరాటీ ఎంఎస్‌జీ రేసింగ్ ఇప్పుడు ట్రాక్‌పై మసెరాటీ టిపో ఫోల్గోరీ జెన్ 3 సింగిల్ సీటర్ వాహనంతో పోటీపడనుంది. ఈ వాహనాన్ని ఎడార్డో మోర్టారా మరియు మ్యాక్స్మిలియన్ గుంథెర్ నడుపనున్నారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు సీజన్ 9 , నాల్గవ రౌండ్‌కు ఆతిధ్యమిస్తుంది. హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ–రేస్ నవాబుల నగరంలో ఫిబ్రవరి11 వ తేదీ జరుగనుంది. మెక్సికో, సౌదీ అరేబియాలలో రేస్‌లు ముగిసిన తరువాత 2023 ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంఫియన్‌షిప్ 16 రేస్ క్యాలెండర్ ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం మసెరాటీ ఎంఎస్‌జీ రేసింగ్ ఎడోర్డో మోర్టారా తో కలిపి మిడ్ ఫీల్డ్‌లో పోటీపడుతుంది. రేస్ 3లో తొలిసారిగా ఈ సీజన్లో పాయింట్లను సాధించడంతో పాటుగా 9వ స్ధానంలో నిలిచింది.
మసెరాటీ కోర్సీ హెడ్ జియోవాన్నీ టోమ్మాసో మాట్లాడుతూ ‘‘ మా సుదీర్ఘకాల విద్యుతీకరణ వ్యూహంలో భాగంగా ఫార్ములా ఈ ను ఎంచుకున్నాము. భావి మొబిలిటీకి అత్యుత్తమ ప్రాతినిధ్యంను ఇది అందిస్తుంది. మసెరాటి టిపో 26తో 96 సంవత్సరాల క్రితం మేము ప్రవేశించిన తరువాత , మసెరాటీ ఎంఎస్‌జీ రేసింగ్ ఫార్ములా ఈ కార్గా పేరు మారినప్పటికీ , మా పోటీతత్త్వం మాత్రం మారలేదు. దిరియా వద్ద మా మొదటి పాయింట్లు మా టీమ్ పట్టుదల సూచించడంతో పాటుగా విజయాలకు మాత్రమే కాదు విద్యుత్ ఉత్పత్తుల అభివృద్ధి పట్ల మా నిబద్ధత సైతం తెలుపుతుంది’’ అని అన్నారు.