Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియాలో అగ్రగామి స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన షియోమీ (Xiaomi), సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ (SGF), మరియు CRY భాగస్వామ్యముతో తన #BackToSchool పౌరసత్వ చొరవ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రకటించింది. హయ్యర్ సెకెండరీ తరగతుల్లో అణగారిన వర్గాలకు చెందిన 1600 మంది పిల్లలు బడిలో తమ చదువును కొనసాగించడానికి ప్రేరణ కలిగిస్తూ వారికి ధ్యాసతో కూడిన మద్దతును అందించడానికి ఈ చొరవ కార్యక్రమం లక్ష్యంగా చేసుకొంది. ఈ భాగస్వామ్యము ద్వారా కంపెనీ, చదువుకు సంబంధించిన మద్దతుతో, చేకూర్పుతో కూడిన అభ్యసన అవకాశాలను అందిస్తూ మరియు త్వరగా బడి మానేసే అవకాశాలను తగ్గిస్తూ ఈ పిల్లలను సాధికారపరచడానికి లక్ష్యంగా చేసుకొంది.
ఈ చొరవ కార్యక్రమం క్రింద, షియోమీ ఇండియా, SGF, మరియు CRY, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో అందుకు తగిన కేంద్రాలను నెలకొల్పాయి. పిల్లలకు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశాలైన తమ చదువు మరియు జీవన నైపుణ్యాలకు సంబంధించి 3 నెలల పాటు హితబోధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గ్రేడ్ IX నుండి గ్రేడ్ XII వరకు గుర్తించబడిన పిల్లలు కేంద్రములో నమోదు చేసుకోబడతారు, మరియు ఉపాధ్యాయులు సహచర- గ్రూపు చదువు, సందేహాల నివృత్తి సెషన్లు, కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సెలింగ్ సెషన్లను నిర్వహిస్తారు, అవి పిల్లలను చదువు, ఉన్నత విద్య మరియు కెరీర్ కొరకు సిద్ధం చేస్తాయి.
భాగస్వామ్యముపై వ్యాఖ్యానిస్తూ షియోమీ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ బి. మురళీక్రిష్ణ గారు ఇలా అన్నారు, “మా #BackToSchool చొరవ కార్యక్రమంతో, సరియైన విద్యా మద్దతుతో యువతను సాధికారపరచడం ద్వారా మేము ఇండియా పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. భారతదేశపు యువ తరం కోసం జీవన నాణ్యతను మెరుగు పరచడానికి సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ మరియు CRY ప్రభావపూరితమైన ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఈ భాగస్వామ్యముతో, మేము ఈ పిల్లల జీవితాలను నిర్మాణాత్మక రీతిలో ప్రభావపరచగల వాతావరణాన్ని ఏర్పరచాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది మరియు తమ చదువు మరియు కలల్ని సాకారం చేసుకునే దిశగా వారికి ప్రేరణ కలిగించే అవకాశాలను ఏర్పరుస్తుంది” అన్నారు.
సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సౌరవ్ గంగూలీ గారు,“షియోమీ ఇండియాతో మా సుదీర్ఘమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతూ, మేము ఈ #BackToSchool చొరవ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమం పిల్లలకు కావలసిన తర్ఫీదుకు ఒక మంచి ప్రారంభాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, తదుపరి చదువుతో ముందుకు సాగే స్థైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది” అన్నారు. ఛైల్డ్ రైట్స్ అండ్ యు, నార్త్, రీజినల్ డైరెక్టర్ సోహా మోయిత్రా గారు మాట్లాడుతూ, “భారతదేశ యువతకు వారి చదువు లక్ష్యాల పట్ల మద్దతు ఇవ్వడానికై ముందుకు వచ్చినందుకు మేము షియోమీ ఇండియా వారికి కృతజ్ఞులమై ఉన్నాము. ఈ భాగస్వామ్యముతో, ఈ పిల్లల జీవిత నాణ్యతను పెంపొందించడానికి మరియు తమ చదువు మరియు కలల్ని పెంచి పోషించుకోవడానికి సకాలములో మద్దతునిస్తూ సహకరించడానికి మేము నిబద్ధులై ఉన్నాము” అన్నారు.
ఈ #BackToSchool చొరవ కార్యక్రమం విద్యార్థులకు తమ యధావిధి బడి చదువుతో పాటుగా అదనపు మద్దతును అందిస్తుంది. విద్యార్థులు తమ చదువులో రాణించడానికి ప్రోత్సాహక మద్దతు అవసరమైన నిర్దిష్ట పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు మరియు శిక్షకులు గుర్తిస్తారు మరియు తగిన బోధనలను అందిస్తారు. షియోమీ ఇండియా వద్ద, చదువు మరియు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలలో చొరవ కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాన్ని సాధికారపరచడంపై నిరంతరంగా దృష్టి సారించబడుతుంది.