Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూపొందించిన విద్యుత్తుతో నడిచే టిప్పర్‌ను బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రదర్శించింది. ఒలెక్ట్రా మాతృసంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తమ ఇతర ఇంధన అనుబంధ సంస్థలైన డ్రిల్మెక్ స్పా, పెట్రీవెన్ స్పా, మేఘా సిటీగ్యాస్, ఐకామ్ టెలీ ఉత్పత్తులనూ ఇక్కడ సందర్శనకు ఉంచింది. నిర్మాణరంగం, గనుల కార్యకలాపాలకు ఒలెక్ట్రా టిప్పర్ ఎంతో అనువైనదని ఆ సంస్థ తెలిపింది. ఒకసారి ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ నెల 6-8 తేదిల్లో జరిగిన ప్రదర్శనలో హాజరైన ప్రతినిధులను ఆకర్షించిందని పేర్కొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల రోడ్లపై ప్రయాణిస్తున్న ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల వివరాల గురించి కూడా హాజరైన వారు అడిగి తెలుసుకున్నారని తెలిపింది.