Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తన ప్రతిష్టాత్మక వార్షిక సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2023ని ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్, ప్రొడక్ట్ ఎక్స్ పో, వార్షిక పరిశ్రమ అవార్డులను అందజేసింది. హైసియా తన ప్రతిష్ఠాత్మకమైన జీవన సాఫల్య అవార్డును ఆర్ చంద్రశేఖర్‌కు మంత్రి కెటిఆర్ ప్రదానం చేశారు. ఐటి, టెలికం రంగంలో విశేష సేవలు అందించడంతో పాటుగా హైదరాబాద్ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డును ఇచ్చారు. హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబూ మాట్లాడుతూ.. ''తెలంగాణ ఐటీ పరిశ్రమ ముందంజలో ఉందని భావిస్తున్నాం. ఈ సరైన సమయంలో, మనం పునరాలోచించాలి, పున్ణసమీక్షించాలి, భవిష్యత్తును పునర్నిర్మించాలి. వచ్చే 3 సంవత్సరాలలో భారతదేశంలో 20 లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని అంచనా'' అని ఆమె చెప్పారు.
అన్వయా కిన్ కేర్‌కు గుర్తింపు
ప్రముఖ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), ఐఓటీ ఆధారిత, సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన ఒన్ స్టాప్ సీనియర్ కేర్ ప్లాట్‌ఫామ్ అన్వయా కిన్ కేర్ సంస్థ హైసియా అవార్డును అందుకుంది. ఇంటి వద్దనే డెమిన్టియా కేర్, ఐఓటీ ఆధారిత ప్రోయాక్టివ్ స్మార్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సొల్యూషన్స్ కోసం బెస్ట్ ప్రొడక్- ఎస్లాబిస్ట్ కేటగిరీలో ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడనేది తమ నిబద్ధత, మౌలిక విలువలకు ప్రతిరూపంగా నిలుస్తుందని అన్వయాకిన్ కేర్ ఫౌండర్, డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.