Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యతను సగర్వంగా చాటినవి మన కళారూపాలు. ఈ కళారూపాలు, కళాకారులను నగరవాసుల చెంతకు తీసుకువస్తూనే , ప్రొఫెషనల్ డిజైనర్లతో ఈ కళాకారులను కలపడం ద్వారా మరింతగా ఆ కళారూపాలకు ప్రాచుర్యం తీసుకువచ్చే క్రమంలో నెక్స్స్ హైదరాబాద్ మాల్ ఇప్పుడు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)తో కలిసి ఫిబ్రవరి 11, 12 తేదీలలో రెండు రోజుల పాటు క్రాఫ్ట్ బజార్‌ను నిర్వహించబోతుంది.
హైదరాబాద్ వాసులు అమితంగా ఇష్టపడే షాపింగ్ కేంద్రంగా ఖ్యాతి గడించిన నెక్సస్ హైదరాబాద్ మాల్, వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణలోనూ ప్రత్యేకతను చాటుతుంది. ఆలోచనాత్మకంగా నిఫ్ట్ హైదరాబాద్‌తో కలిసి తీర్చిదిద్దిన ఈ కార్యక్రమంతో సందర్శకులకు విస్తృత శ్రేణిలో భారతీయ హస్తకళాకారులు, చేనేత కళారూపాలను కలుసుకునే అవకాశం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ నుంచి వచ్చే నైపుణ్యవంతులైన కళాకారులను నగరవాసులతో కలిపే బృహత్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సైతం తమ మద్దతు తెలిపింది.
రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్రాఫ్ట్ బజార్‌ను సందర్శించండి. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను సైతం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. విస్తృతశ్రేణిలో అందుబాటులో ఉన్న కళారూపాలైన బిద్రి, గోలబామా చీరలు, వరంగల్ నుంచి దరీస్, ఉదయ్గిరి కట్లరీ వస్తువులు, కొండపల్లి చెక్క బొమ్మలు, నారాయణ్‌పేట చీరలు, పోచంపల్లి చీరలు, కలంకారి హ్యాండ్లూమ్స్, మంగళగిరి హ్యాండ్లూమ్, డోక్రా మెటల్ క్రాఫ్ట్ సహా ఎన్నో సొంతం చేసుకోవచ్చు.