Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.6.5 లక్షలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మార్కెట్లోకి కొత్త టూర్ ఎస్ మోడల్‌ను విడుదల చేసింది. రెండు వేరియింట్లలో దీన్ని ఆవిష్కరించింది. 1.2 లీటర్ 5ఎంటి ధరను రూ.6,51,000గా నిర్ణయించింది. సిఎన్జి వర్షన్ ధరను రూ.7.36 లక్షలుగా ప్రకటించింది. 1.2ఎల్ కె-సీరిస్ ఇంజిన్‌తో ఆవిష్కరించిన ఈ మోడల్ తమ సంస్థను మరింత బలోపేతం చేయనుందని మారుతి సుజుకి విశ్వాసం వ్యక్తం చేసింది.