Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సార్ ఆయిల్ ఛైర్మన్ వెల్లడి
బెంగళూరు : దేశంలో ఉద్గారాల తీవ్రతను 45 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడంలో శిలాజ ఇంధనాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని ఎస్సార్ కాపిటల్ డైరెక్టర్, ఎస్సార్ ఆయిల్ యుకె బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించిన ఇండియా ఎనర్జీ వీక్లో 'అతి తక్కువ కార్బన్ ఎనర్జీ మిక్స్ దిశగా పరివర్తన : ఇంధన కంపెనీలు ఏ విధంగా స్వీకరిస్తున్నాయి..?.'' అనే అంశంపై రుయా మాట్లాడుతూ.. ఇప్పటికే ఉన్న స్వచ్ఛ ఇంధన సామర్థ్యాల మార్పు, నూతన శక్తి సామర్థ్యాలను కలిపి సృష్టించాలన్నారు. ప్రస్తుత ఇంధనాలను ఒక్కసారిగా మార్చడం సాధ్యం కాదని, నూతన, స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను నిర్మించడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలను వినియోగించాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో అసాధారణ వృద్థి కనిపించనుందన్నారు.