Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బుంగళూరు
“యూపీఐ ఇంటర్నేషనల్” పేమెంట్లకు సహకారాన్ని ప్రారంభించామని భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ పేమెంట్ల కంపెనీ అయిన ఫోన్ పే ఈరోజు ప్రకటించింది. ఈ ఫీచర్ విదేశాలకు వెళుతున్న PhonePe యొక్క భారతీయ వినియోగదారులకు UPIని ఉపయోగించి విదేశీ మర్చంట్లకు తక్షణమే పే చేసేందుకు వీలు కల్పిస్తుంది. యునైటడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, నేపాల్, భూటాన్లలో స్థానిక QR కోడ్ కలిగిన అంతర్జాతీయ మర్చంట్ అవుట్లెట్లు అన్నిటికీ తక్షణ పేమెంట్లు చేసేందుకు సహకరిస్తుంది. అంతర్జాతీయ డెబిట్ కార్డులతో చేసిన విధంగానే తమ భారతీయ బ్యాంకుల నుండి నేరుగా విదేశీ ద్రవ్య రూపంలో వినియోగదారులకు పేమెంట్లు చేయవచ్చు. భారతదేశంలో ఈ ఫీచర్‌ను ఆవిష్కరించిన మొదటి ఫిన్ టెక్ యాప్ అనే ఘనతను PhonePe దక్కించుకుంది.
విదేశాలలో ప్రయాణం చేసే లక్షలాది మంది భారతీయులకు సురక్షితమైన మరియు సులభమైన లావాదేవీలను సౌకర్యవంతం చేయడానికి UPI ఇంటర్నేషనల్ రూపొందించబడింది. ఇప్పటివరకు భారతీయ కస్టమర్లు అంతర్జాతీయ వ్యాపారి అవుట్లెట్లలో చెల్లించడానికి విదేశీ కరెన్సీని లేదా వారి క్రెడిట్ లేదా ఫారెక్స్ కార్డ్‌లను ఉపయోగించాల్సి వస్తోంది. ఈ ఫీచర్‌తో, వారు ఇప్పుడు UPIని ఉపయోగించి చెల్లించడానికి వారి భారతీయ బ్యాంక్ ఖాతాను ఉపయోగించవచ్చు. ఈ సంవత్సరం ముగిసే సమయానికి, NIPL (NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్) సహకారంతో UPI ఇంటర్నేషనల్‌ను మరిన్ని దేశాలకు అందుబాటులోకి NPCI తీసుకురావాలని యోచిస్తోంది, అదే సమయంలో ఈ ఫీచర్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మర్చంట్లనుండి ఆమోదానికి కూడా వీలు కల్పిస్తోంది.
ఈ పురోగతి గురించి PhonePe CTO, సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి మాట్లాడుతూ, “గడచిన ఆరేళ్లకు పైగా, భారతదేశ వ్యాప్తంగా మన జీవితాలను రూపాంతరం చేసిన UPI పేమెంట్ల విప్లవాన్ని అనుభవించడంలో మేము చాలా అదృష్టవంతులము. ప్రపంచంలోని ఇతర భూభాగాలకు కూడా UPI అనుభవాన్ని అందించడంలో UPI ఇంటర్నేషనల్ మొదటి ప్రధాన అడుగుగా నిలుస్తుంది. ఇది ఒక గేమ్‌ఛేంజర్‌గా నిరూపించబడుతుందని, విదేశాలకు వెళ్లే భారతీయులు మర్చంట్ అవుట్ లెట్లలో పే చేసే పద్ధతిని పూర్తిగా మారుస్తుందని నేను గట్టిగా చెప్పగలను. మార్కెట్ కు కొత్త UPI ఫీచర్లను తీసుకునే మొదటి TAPP (థర్డ్ పార్టీ యాప్)గా నిలవడం పట్ల ఎప్పటిలాగే PhonePe గర్విస్తోంది. ఈ దఫా కూడా అందులో ఎలాంటి మార్పు లేదు. PhonePe ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రపంచం మొత్తం UPI అనుభవాన్ని ఆస్వాదించాల్సిన అవసరముంది” అని అన్నారు.
PhonePe వినియోగదారులు తమ UPI లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను UPI ఇంటర్నేషనల్ కోసం మర్చంట్ స్థానంలో లేదా వారి అంతర్జాతీయ పర్యటనకు ముందు PhonePe యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కార్యకలాపం సురక్షితమైనది మాత్రమే కాక సేవను యాక్టివేట్ చేయడానికి కస్టమర్ వారి UPI పిన్ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఫోన్ పే గురించి:
డిసెంబర్ 2015లో స్థాపించబడిన PhonePe సంస్థ అటు వినియోగదారులను, ఇటు మర్చంట్లను డిజిటల్ మార్గంలోకి తీసుకువచ్చేలా వీలు కల్పిస్తూ భారతదేశపు అతిపెద్ద పేమెంట్ల యాప్‌గా అవతరించింది. 43.5 కోట్ల (435+ మిలియన్)కు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులతో, ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు ఇప్పుడు PhonePeసేవలను అందుకుంటున్నారు. దేశంలోని 99% పిన్ కోడ్లను కవర్ చేస్తూ, 2,3,4 మరియు ఆ తర్వాతి శ్రేణి పట్టణాలలో ~3.5 కోట్ల (~35 మిలియన్)కు పైగా ఆఫ్‌లైన్ మర్చంట్లను కంపెనీ విజయవంతంగా డిజిటలైజ్ చేసింది. భారత్ బిల్ పే సిస్టమ్ (BBPS)లో కూడా PhonePe అగ్రగామిగా నిలుస్తోంది. BBPS ప్లాట్‌ఫారమ్‌లో 45% లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. PhonePe 2017లో ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించి, తన వేదికలలో వినియోగదారులకు సురక్షితమైన మరియు అనుకూలమైన పెట్టుబడి ఆప్షన్లను అందిస్తోంది. అప్పటి నుండి, కంపెనీ అనేక మ్యూచువల్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది, ఇవి ప్రతి భారతీయుడికి డబ్బు అందుబాటులో ఉండడానికి, సేవలకు యాక్సెస్ ను సులభతరం చేయడానికి సమాన అవకాశాన్ని అందిస్తాయి. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (TRA) విడుదల చేసిన బ్రాండ్ విశ్వసనీయత నివేదిక 2022 ప్రకారం PhonePe ఇటీవల డిజిటల్ పేమెంట్ల అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తించబడింది.