Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమాయకత్వంతో కూడిన యుగం ముగిసింది
నవతెలంగాణ - హైదరాబాద్
అమాయకత్వంతో కూడిన యుగం ముగిసింది, ఇప్పుడు స్ధిరత్వంతో కూడిన యుగం ప్రారంభమైంది అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మరియు గృహ, నగర వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పురి అన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ ముగింపు వేడుకలలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశపు జీ20 అధ్యక్షత కింద నిర్వహించే భారీ కార్యక్రమాలలో మొదటిదిగా, ఇది భారతదేశానికి వినూత్న అవకాశం అందించిందని, ఇంధన రంగంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శించే అవకాశమూ లభించిందన్నారు. 2070 నాటికి సీఓపీ 26 లో వెల్లడించినట్లుగా నెట్ జీరో లక్ష్యం చేరుకోగలమని పురి అన్నారు. ఐఈడబ్ల్యు 2023 అత్యుత్తమ ఆరంభంగా పేర్కొన్న పురి, గత మూడు రోజులుగా ఐఈడబ్ల్యు ద్వారా తాము చేసినట్లుగా ఎనర్జీ ట్రాన్సిషన్ పరంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న మరే దేశ సమస్యలనూ ఆచరణాత్మకంగా పరిష్కరించలేదన్నారు.
ఇండియా ఎనర్జీ వీక్‌తో పాటుగా 7వ రౌండ్ టేబుల్లో గౌరవ నీయ ప్రధానమంత్రి, సీఈఓలు, చమురు, సహజవాయు రంగాల నిపుణులు పాల్గొన్నారని, 30సంస్థల సీఈఓలు, నిపుణులు పలు అంశాలపై కూలంకుషంగా ఇక్కడ చర్చలను నిర్వహించారన్నారు. దీనితో పాటుగా 9వ ఆసియన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబుల్ సైతం ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ సహకారంతో ఇంధన భద్రత, ఇంధన న్యాయం, వృద్ధి, ఆవిష్కరణలను సాధించడం కోసం స్ధిరమైన మరియు సురక్షితమైన మార్గాలను మ్యాపింగ్ చేయడం’ అనే అంశంపై నిర్వహించారు. దీనితో పాటుగా యుఎస్ ఎగ్జిక్యూటివ్ రౌండ్ టేబుల్ ను యుస్ –ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ మరియు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్‌తో నిర్వహించారు.
మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారేందుకు ఇండియా సరైన దిశలో ఉంది. 2040 వరకూ అంతర్జాతీయ డిమాండ్‌లో 25% వాటాను ఇది కలిగి ఉంటుంది. అంతర్జాతీయంగా ఇంధన రంగంలో ఇండియా అత్యంత కీలకం కానుంది. దీని అంతర్జాతీయ ఇంధన వినియోగం 2020లో 5.7 %నుంచి 2050 నాటికి 11.9% చేరనుందని పురి తెలిపారు. గత కొద్ది రోజులుగా తాము సాధించిన దాని పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నామన్న పురి, తరువాత ఎడిషన్ ఇండియా ఎనర్జీ వీక్ గోవాలో జరుగనుందన్నారు.