Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్లూటూత్ ఆధారిత వై–కనెక్ట్ అప్లికేషన్‌తో ఎఫ్జెడ్ఎస్ –ఎఫ్ఐ వీ4 డీలక్స్ విడుదల
- ఎఫ్జెడ్ఎస్ –ఎఫ్ఐ వీ4 డీలక్స్, ఎఫ్‌జెడ్–ఎక్స్ మరియు ఎంటీ–15 వీ2 డీలక్స్‌లో స్టాండర్డ్ ఫీచర్‌గా టీసీఎస్ లభ్యం
- ఎల్ఈడీ ఫ్లాషర్స్ జోడించబడిన 2023 వెర్షన్ మోటర్‌సైకిల్ మోడల్స్ ఇప్పుడు నూతన రంగులతో వస్తాయి
- అన్ని యమహా మోటర్‌సైకిల్ మోడల్స్ ఈ–20 ఫ్యూయల్ అనుకూలంగా 2023 సంవత్సరాంతానికి మారనున్నాయి
- 2023 మోటర్‌సైకిల్ శ్రేణి యమహా మోటర్ సైకిల్స్ ఆన్‌బోర్డ్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థ కలిగి ఉన్నాయి
నవతెలంగాణ - హైదరాబాద్
దేశవ్యాప్తంగా బైకింగ్ ప్రియులకు మరింత ఉత్సాహపూరితమైన మరియు థ్రిల్లింగ్ సవారీ అనుభవాలను అందించేందుకు ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ నేడు 2023 వెర్షన్ ఎఫ్జెడ్ఎస్–ఎఫ్ఐ వీ4 డీలక్స్, ఎఫ్‌జెడ్ –ఎక్స్ , ఎంటీ–15 వీ2 డీలక్స్ మరియు ఆర్15ఎం ను సరికొత్త ఆకర్షణలు, ఈ శ్రేణిలో అత్యుత్తమ ఫీచర్లతో అందిస్తుంది. 150 సీసీ క్లాస్ విభాగానికి నేతృత్వం వహిస్తూ యమహా ఆర్15 ఎం మరియు ఆర్15 వీ4 తో పాటుగా యమహా ఎఫ్జెఎస్–ఎఫ్ఐ వీ4 డీలక్స్, ఎఫ్‌జెడ్–ఎక్స్ మరియు ఎంటీ–15 వీ2 డీలక్స్ మోడల్స్ ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్) స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తాయి. ఈ టీసీఎస్, ఇగ్నైషన్ టైమింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ వాల్యూమ్ నియంత్రిస్తుంది.
ఈ సందర్భంగా యమహా మోటర్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ ‘‘ ప్రస్తుత కాల్ ఆఫ్ ద బ్లూ బ్రాండ్ క్యాంపెయిన్‌లో భాగంగా యమహా ఇప్పుడు అత్యంత ఉత్సాహపూరితమైన ఫీచర్లను భారతదేశంలో తమ అంతర్జాతీయ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో పరిచయం చేసింది. దీనిలో భాగంగానే మా 149సీసీ–155సీసీ ప్రీమియం మోటర్‌సైకిల్ శ్రేణిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నాము. ఈ నూతన ఫీచర్లు మా యువ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి’’అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా నేడు ఎఫ్జెడ్ఎస్–ఎఫ్ఐ వీ4 డీలక్స్ మరియు ఎఫ్‌జెడ్–ఎక్స్ మోడల్స్‌ను ఈ20 ప్యూయల్ ప్రమాణాలతో ఈ సంవత్సరాంతానికి అందించనున్నాము’’ అని అన్నారు.
Pricing Information:
Models New Color Ex-Showroom (Delhi)
FZS-Fi V4 Deluxe - Rs. 1, 27,400
FZ-X Dark Matte Blue Rs. 1, 36, 900
R15M - Rs. 1, 93, 900
R15V4 Dark Knight Rs. 1, 81,900
MT15 V2 Deluxe Metallic Black Rs. 1, 68, 400
--