Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెలాక్సీ® ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్‌తో ఐకానిక్ గ్లోబల్ చాక్లెట్ బ్రాండ్ల స్థానిక ఉత్పత్తిని విస్తరిస్తుంది
- దీనితో, బ్రాండ్ భారతదేశంలోని మౌల్డ్ సెగ్మెంట్లో మొదటి మూడు చాక్లెట్ బ్రాండ్లలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు, కేటగిరీ కన్నా రెండంకెల వృద్ధిని సాధించాలని భావిస్తోంది.
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో చాక్లెట్లు, చూయింగ్ గమ్, పుదీనా మరియు ఫ్రూటీ మిఠాయిల తయారీలో ఉన్న మార్స్ రిగ్లీ ఇండియా ఈ వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఇది 100 ఏళ్ల యూఎస్ ఆధారిత మార్స్ ఇన్కార్పొరేటెడ్ ద్వారా ట్రీట్లు, స్నాక్స్ విభాగంలో ముందంజలో కొనసాగుతోంది. భారతదేశంలో 70% కోకోతో గెలాక్సీ® ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్ల విడుదల చేస్తుండగా, వీటిని స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నామని సగర్వంగా ప్రకటించింది. ఇది భారతదేశంలో డార్క్ చాక్లెట్ విభాగంలోకి మార్స్ రిగ్లీ ఇండియా ప్రవేశించడాన్ని మరియు 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్న బ్రాండ్ గెలాక్సీ® స్థానిక ఉత్పత్తిని గణనీయంగా విస్తరించడాన్ని సూచిస్తోంది. డార్క్ చాక్లెట్‌తో సహా స్వచ్ఛమైన ఆనందం నుంచి ‘బెటర్ ఫర్ యూ’ ట్రీట్ల వరకు తమ స్నాక్స్‌లో విభిన్న ఎంపికలను కోరుకునే అనేక మంది వినియోగదారులు డార్క్ చాక్లెట్ ఉత్పత్తిని ఆదరిస్తారని కంపెనీ ధీమాతో ఉంది.
గెలాక్సీ® బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోకి డార్క్ చాక్లెట్లను తీసుకు రావడం ద్వారా, మార్స్ రిగ్లీ ఇండియా మోల్డ్ చాక్లెట్ల విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలోని ఐకానిక్ బ్రాండ్లలో ఒకటైన గెలాక్సీ® స్థానిక ఉత్పత్తిని అక్టోబర్ 2021లో ఫుణెలోని తన ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంలో ప్రకటించింది. గెలాక్సీ® 2016లో స్నిక్కర్స్® తర్వాత భారతదేశపు మార్కెట్ కోసం, భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడిన రెండవ ప్రపంచ చాక్లెట్ బ్రాండ్‌గా అవతరించడం కంపెనీకి ఒక కీలక మైలురాయి అని చెప్పవచ్చు.
వీటి విడుదల సందర్భంలో మార్స్ రిగ్లీ ఇండియా దేశీయ జనరల్ మేనేజర్ కల్పేష్ పర్మార్ మాట్లాడుతూ, “భారతదేశంలో 70% కోకోతో గెలాక్సీ® ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్‌ను విడుదల చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. పుణెలోని మా ప్రపంచ స్థాయి చాక్లెట్ ఉత్పత్తి కేంద్రంలో మేము భారతదేశంలో గ్లోబల్ బ్రాండ్‌ను తయారు చేయడం చాలా గర్వించదగిన విషయం. అదే నాణ్యత, సిగ్నేచర్ వంటకాలతో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే బ్రాండ్లను తయారు చేసేందుకు మేము మా స్థానిక తయారీ సామర్థ్యాలను విస్తరించుకోవడం మాకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. ఇది నిస్సందేహంగా మాకు అధిక ఉత్పత్తిని, తాజాగా అందుబాటుకు అనుమతిస్తుంది మరియు అధిక సంఖ్యలో భారతీయ వినియోగదారులకు ఈ చాక్లెట్ ఆనందాన్ని అందిస్తుంది. గెలాక్సీ® ఫ్యూజన్స్ అనేది డార్క్ చాక్లెట్‌కు సంబంధించిన కొత్త-ప్రపంచ అనుభవం మరియు గెలాక్సీ®ని సూచిస్తుంది. విభిన్నమైన ఎంపికలను కోరుకునే మా వినియోగదారులలో ఎక్కువ మంది డార్క్ చాక్లెట్ ఉత్పత్తి లభ్యతను, వారి స్నాక్స్, స్వచ్ఛమైన ఆనందం నుంచి డార్క్ చాక్లెట్‌తో సహా ‘బెటర్ ఫర్ యూ’ ట్రీట్ల వరకు స్వాగతిస్తారని మేము విశ్వసిస్తున్నాము.
మార్స్ రిగ్లీకి భారతదేశం కీలక మార్కెట్ కాగా, మేము ఈ కేటగిరీని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాము. పలు సంవత్సరాలుగా, మేము ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే మా బ్రాండ్లను ప్రారంభించడంతో పాటు భారతదేశానికి సరితూగే పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసేందుకు శ్రద్ధ తీసుకుంటున్నాము. అధిక నాణ్యత గల చాక్లెట్లు మరియు మిఠాయిలను భారతీయ గృహాల్లోకి తీసుకురావడమే మా ప్రయత్నం’’ అని వివరించారు.
మార్స్ రిగ్లీ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ వరుణ్ కంధారి మాట్లాడుతూ, ‘‘గెలాక్సీ® ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్ మా భారతీయ వినియోగదారులను ఆహ్లాదపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము. గెలాక్సీ® ఫ్యూజన్స్ తన ప్రీమియం సిగ్నేచర్ రెసిపీ, 70% కోకో కంటెంట్, మృదువైన ఆకృతితో రిచ్ చాక్లెట్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన ఈ డార్క్ వేరియంట్, చాక్లెట్ ప్రియులకు మరియు వాటిని అమితంగా ఇష్టపడే వారికి ఒక అద్భుతమైన మల్టీ-సెన్సరీ అనుభవాన్ని అందించడం ఖాయం’’ అని అన్నారు.
గెలాక్సీ® ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్ సాంప్రదాయ, ఆధునిక రిటైల్ అవుట్లెట్లు మరియు దేశవ్యాప్తంగా అన్ని ఇ-కామర్స్ పోర్టల్లలో రూ.90 నుంచి లభిస్తాయి. మార్స్ రింగ్లీ విభిన్న పోర్ట్‌ఫోలియోలలో ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే స్నికర్స్®, బౌంటీ®, ఎం & ఎమ్స్ స్కిటెల్స్®, ఆర్బిట్®, డబుల్ మింట్®, బూమర్®, సొలానో® తదితర బ్రాండ్లు ఉన్నాయి.