Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డిఎఫ్సి పైలెట్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంటర్నెట్ లేనప్పటికీ ఆఫ్లైన్లో డిజిటల్ చెల్లింపులు చేసేలా సేవలను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించినట్లు ఆ బ్యాంక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్బిఐ రెగ్యూలేటరీ అనుమతులతో నాలుగు నెలల పాటు దశళ వారిగా రూ.200 పరిమితి చెల్లింపులతో ఆఫ్లైన్ డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఆఫ్లైన్ పే పేరుతో ఈ సేవలను ప్రారంభించినట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడించింది. ఈ సేవలపై స్పష్టత రావాల్సి ఉంది.