Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో అధిక లాభాల వృద్థిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) అగ్రస్థానంలో ఉంది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 12 పీఎస్‌బీలు సంయుక్తంగా 65 శాతం వృద్థితో రూ.29,175 కోట్ల నికర లాభాలు సాధించాయి. కాగా.. బీఓఎం ఏకంగా 139 శాతం వృద్థితో రూ.775 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ఆ బ్యాంక్ తెలిపింది. బీఓఎం తర్వాత స్థానంలో యూకో బ్యాంక్ 110 శాతం వృద్థితో రూ.653 కోట్ల లాభాలు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 శాతం, ఇండియన్ బ్యాంక్ 102 శాతం చొప్పున పెరుగుదలను సాధించాయి. బీఓఎం స్థూల ఎన్పీఏలు 2.94 శాతానికి తగ్గాయి.