Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శామ్ సంగ్ తమ ఆధునిక గేమింగ్ మానిటర్స్ - శామ్ సంగ్ ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8, ఒడిస్సీ జీ7 మరియు ఒడిస్సీ జీ7 నియోలను తెచ్చిన శామ్ సంగ్; ప్రీమియం గేమింగ్ అనుభవం కోసం ఉత్తమమైన డిస్ ప్లే మరియు గొప్ప పిక్చర్ నాణ్యతను అనుభవించండి
- జీటీజీ 0.1ms మరియు 175Hz రిఫ్రెష్ రేట్ తో ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 అతి వేగవంతమైన గేమింగ్ మానిటర్ . ఇది శామ్ సంగ్ నియో క్వాంటమ్ ప్రాసెసర్ తో సజీవమైన వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది
- ఒడిస్సీ నియో జీ7 క్వాంటమ్ మాట్రిక్స్ టెక్నాలజీతో లభిస్తోంది మరియు 165 Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తోంది, గేమింగ్ ఔత్సాహికులకు సాఫీ మరియు మసకరహితమైన గేమింగ్ అనుభవాన్ని ఇస్తోంది
- స్మార్ట్ టీవీ అనుభవాన్ని అందించడానికి ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 మరియు ఒడిస్సీ నియో జీ7(43")లు మీడియా వేదికను కలిగి ఉన్నాయి
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో, అతి పెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్, తమ సరికొత్త శ్రేణి ఒడిస్సీ గేమింగ్ మానిటర్స్ ను భారతదేశపు వినియోగదారులు కోసం ఆరంభించింది. ద ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8, ఒడిస్సీ జీ7, మరియు జీ7 నియోలు నియో క్వాంటమ్ ప్రాసెసర్, హెచ్ డీఆర్ ట్రూ బ్లాక్ 400, స్మార్ట్ ఎంటర్టైన్మెంట్, మరియు ఏఎండీ ఫ్రీ సింగ్ ప్రీమియం ప్రో వంటి ఆధునిక ఫీచర్స్ తో ఒడిస్సీ గేమింగ్ మానిటర్ సీరీస్ కు సరికొత్త చేరిక.
మానిటర్స్ ఇంజనీర్డ్ చేయబడ్డాయి మరియు వేగవంతమైన రిఫ్రెష్ రేట్స్, మెరుగైన గేమింగ్, మరియు వ్యూయింగ్ అనుభవం, మెరుగుపరచబడిన ఆడియో వ్యవస్థ మరియు అత్యధిక పిక్సెల్ డెన్సిటీ అందచేయడానికి రూపొందించబడ్డాయి, ప్రీమియం నాజూకైన లోహపు డిజైన్ లో ప్యాక్ చేయబడ్డాయి. ఒడిస్సీ మానిటర్స్ యొక్క సరికొత్త శ్రేణి గేమర్స్ కోసం పరిపూర్ణమైనవి, ఎందుకంటే అవి వేగవంతమైన ప్రతిస్పందన సమయంతో మరియు గొప్ప పిక్చర్ నాణ్యతతో లభిస్తూ, తమ గేమింగ్ అనుభవం మరింతగా లీనమయ్యే విధంగా చేసాయి.
గేమింగ్ మానిటర్స్ కొత్త శ్రేణి తదుపరి స్థాయి గేమింగ్ అనుభవాన్ని, వినోదాన్ని తమ స్మార్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ తో అదే స్క్రీన్ పై అందిస్తున్నాయి. ఇన్ బిల్ట్ వినోదపు హబ్ ఫీచర్ తో, వినియోగదారులు గేమింగ్ మానిటర్ ను కేవలం ఒక క్లిక్ తో స్మార్ట్ టీవీగా మారుస్తున్నారు. "ఆధునికమైన శామ్ సంగ్ ఒడిస్సీ గేమింగ్ మానిటర్స్ ఉత్తమంగా కనువిందు చేస్తాయి. యువ గేమర్స్ కు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న అవసరాలకు సేవలు అందించే కలతో, ఒడిస్సీ గేమింగ్ మానిటర్స్ ఆధునిక భవిష్య టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. కొత్త మానిటర్స్ శ్రేణి గేమింగ్ ఔత్సాహికులకు సేవలు అందించడమే కాకుండా తమ స్మార్ట్ వినోదపు వేదిక ద్వారా అమోఘమైన సినీమాటిక్ అనుభవాన్ని కేటాయిస్తుంది. సాటిలేని రిఫ్రెష్ రేట్ మరియు స్క్రీన్స్ యొక్క నాజూకైన డిజైన్ లు ఆధునిక యూజర్ కు ప్రాథమికంగా అవసరం మరియు వీరు జాప్యాలు మరియు ఆలస్యాల స్థానంలో వేగానికి ప్రాధాన్యతనిస్తారు," అని పునీత్ సేథీ, వైస్ ప్రెసిడెంట్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ ప్రైజ్ బిజినెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.
ఇంతకు ముందు లేని విధంగా సినిమాటిక్ మరియు గేమింగ్ అనుభవం
GTG 0.1ms & 175 Hz రిఫ్రెష్ రేట్ తో ద ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8కు పూర్తి ఒడిస్సీ శ్రేణిలో అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన సమయం ఉంది. 21:9 యాస్పెక్ట్ నిష్పత్తితో 34-అంగుళాల స్క్రీన్ అత్యంత -వెడల్పు, క్యూహెచ్ డీ రిజల్యూషన్ (3,440 x 1,440)ను అందిస్తూ గొప్ప పిక్చర్ నాణ్యతను తయారు చేస్తోంది. అతుల్యమైన దృశ్యాలు కోసం , అత్యంత ప్రీమియం గేమింగ్ అనుభవం కోసం ఇది 100% కలర్ వాల్యూమ్ మరియు డీసీఐ- 99.3% కలర్ గాముట్ తో లభిస్తోంది. పరిపూర్ణమైన ప్లేయింగ్ వ్యూ కోసం మెరుగుపరచబడిన ఇమ్మర్షన్ మరియు 1800R కర్వేచర్ కోసం అత్యంత సూక్ష్మమైన వివరాలను తీసుకురావడానికి మిలియన్ -టు-వన్ స్టాటిక్ కాంట్రాస్ట్ ద్వారా ఇది మెరుగుపరచబడింది.
ఒడిస్సీ నియో జీ7 అనేది కొత్త ఫార్మ్ ఫ్యాక్టర్ తో శామ్ సంగ్ వారి మొదటి ఫ్లాట్ మినీ-ఎల్ఈడీ మోడల్. నేటి ఉత్తమమైన గ్రాఫిక్స్ ను చూపించే ఆధునిక పిక్చర్ నాణ్యత కోసం పెద్ద 43" స్క్రీన్ 4కే వెసా డిస్ ప్లే హెచ్ డీఆర్ 600 మరియు హెచ్ డీఆర్ 10+ ధృవీకరణతో రిజల్యూషన్ ను(3,840 x 2,160) అందిస్తుంది. ద ఒడిస్సీ నియో జీ7 శామ్ సంగ్ వారి క్వాంటమ్ క్వాంటమ్ మినీ ఎల్ఈడీలను ఉపయోగిస్తూ మ్యాట్రిక్స్ టెక్నాలజీని ముందు స్థానంలోకి తెచ్చింది. ఇది దగ్గరగా అమర్చిన ఎల్ఈడీలను అత్యంత ఉత్తమంగా మరియు సూక్ష్మమైన నియంత్రణ చేయడానికి వీలు కల్పిస్తాయి.
ఒడిస్సీ జీ7 అనేది ప్రీమియం ఫ్లాట్ యూహెచ్ డీ గేమింగ్ మానిటర్. ఇది విస్త్రతమైన వ్యూయింగ్ కోణం యొక్క 178° ద్వారా స్పష్టమైన ఇమేజ్ తో ఐపీఎస్ ప్యానల్ తో పాటు 144 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తోంది. సాఫీ మరియు ఆకట్టుకునే గేమ్ ప్లే కోసం గేమర్స్ అవసరాన్ని సంతృప్తిపరచడానికి వేగవంతమైన 1ms ప్రతిస్పందన సమయం మరియు స్పష్టమైన క్యూఎల్ఈడీ పిక్చర్ నాణ్యత సహా వివిధ ఫీచర్స్ యొక్క శక్తివంతమైన కలయికను కలిగి ఉంది.
మెరుగుపరచబడిన గేమింగ్ అనుభవం కోసం అప్ గ్రేడ్ చేయబడిన పనితీరు
ద ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 మానిటర్ అనేది వెసా డిస్ ప్లే కలిగిన హెచ్ డీఆర్ 400 ట్రూ బ్లాక్ చే ధృవీకరించబడింది, ఖచ్చితమైన రంగు మరియు కాంట్రాస్ట్ పునః ఉత్పత్తితో స్పష్టంగా మరియు సజీవంగా కంటెంట్ కనిపించేలా నిర్థారిస్తుంది. వేగవంతమైన ప్రతిస్పందన సమయం మరియు ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 యొక్క రిఫ్రెష్ రేట్ కు అదనంగా , గేమర్స్ కు గేమింగ్ వాతావరణం శ్రేణిలో అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలు మరియు వాస్తవిక ప్రపంచం ఖచ్చితత్వాన్ని ఇస్తుంది . సాఫీ గేమ్ ప్లే కోసం ఏఎండీ ఫ్రీ సింక్ ప్రీమియం ద్వారా మానిటర్ మరింతగా మెరుగుపరచబడింది.
ఒడిస్సీ నియో జీ7 165 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు చేస్తుంది మరియు 1 ms (జీటీజీ) ప్రతిస్పందన సమయం వేగవంతమైన, సాఫీ ప్రతిస్పందనకు అనుమతి ఇస్తుంది మరియు ఖచ్చితంగా మౌస్ కదలడానికి వీలు కల్పిస్తుంది. అత్యంత తీవ్రమైన కదలికలలో సహితం, ఒడిస్సీ నియో జీ7 అత్యంత సాఫీ మరియు వేగవంతమైన గేమ్ ప్లే చర్యను ఉంచుతుంది మరియు ఏఎండీ ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో సహాయం ద్వారా స్టట్టరింగ్ , ఇన్ పుట్ లేటెన్సీ మరియు స్క్రీన్ టియరింగ్ ను తగ్గిస్తుంది. ద 28 అంగుళాల ఒడిస్సీ జీ7 ఆధునిక డిజైన్ తో లభిస్తోంది. ఇది అత్యంత వెడల్పైన గేమ్ వ్యూను , ఆటో సోర్స్ స్విచ్ + అందిస్తోంది, ఇది జీ-సింక్ తో కూడా అనుకూలంగా ఉంటుంది.
ధర మరియు లభ్యత
ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 మానిటర్ భారతదేశంలో సిల్వర్ రంగులో రూ. 175,000కి లభిస్తోంది. ఒడిస్సీ నియో జీ7 తెలుపు రంగులో 43" మరియు నలుపు రంగులో 32" కు వరుసగా రూ. 100,000 మరియు రూ. 130,000 కు లభిస్తున్నాయి. నలుపు రంగులో ఒడిస్సీ జీ7 రూ. 75,000కు లభిస్తోంది.
కస్టమర్స్ శామ్ సంగ్ అధికారిక ఆన్ లైన్ స్టోర్ శామ్ సంగ్ షాప్, అమేజాన్, మరియు అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్స్ లో మానిటర్స్ ను కొనుగోలు చేయవచ్చు.
మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి https://www.samsung.com/in/monitors/gaming/
ఆఫర్స్
ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 మరియు ఒడిస్సీ నియో జీ7లు ఐసీఐసీఐ మరియు ప్రముఖ బ్యాంక్స్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐకి తక్షణ డిస్కౌంట్ రూ. 1750తో లభిస్తున్నాయి
కీలకమైన వివరణలు ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8
ఒడిస్సీ మానిటర్స్ శ్రేణిలో అత్యంత వేగవంతమైన ఓఎల్ఈడీ గేమింగ్ మానిటర్ , శామ్ సంగ్ నియో క్వాంటమ్ ప్రాసెసర్ ఇన్ స్టాల్ చేయబడటం వలన సజీవమైన వ్యూయింగ్ అనుభవాన్ని ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 కేటాయిస్తుంది. GTG 0.1ms & 175Hz రిఫ్రెష్ రేట్ డివైజ్ యొక్క గేమింగ్ సామర్థ్యాన్ని సాటిలేనిదిగా చేసింది. ఇది 21:9 అల్ట్రా డబ్ల్యూక్యూహెచ్ డీ (3440 x 1440) రిజల్యూషన్ తో లభిస్తోంది. పిక్చర్ నాణ్యతను మెరుగుపరచడం ద్వారా గేమర్స్ కు గేమింగ్ లో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తోంది. ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ8 డిజైన్ నాజూకైనది మరియు బాడీకి మెటల్ ఫినిష్ ఉండి దానికి ప్రీమియం రూపం అందిస్తోంది.
ఒడిస్సీ నియో జీ7
ఒడిస్సీ నియో జీ7 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1ms (జీటీజీ) ప్రతిస్పందన సమయం వరకు మద్దతు ఇస్తుంది, వేగంగా, సాఫీ ప్రతిస్పందనకు అవకాశం ఇస్తుంది మరియు ఖచ్చితంగా మౌస్ కదలికలకు వీలు కల్పిస్తుంది. స్క్రీన్ ను మసకరహితంగా చేయడం ద్వారా గేమింగ్ అనుభవాన్ని పెంచుతుంది. ఒడిస్సీ నియో జీ7 మ్యాటీ డిస్ ప్లే స్క్రీన్ ను యాంటీ-గ్లేర్ మరియు యాంటీ-రిఫ్లక్షన్ చేస్తుంది. అత్యంత తీవ్రమైన క్షణాల్లో సహితం, ఒడిస్సీ నియో జీ7 ఎంతో సాఫీ మరియు వేగవంతమైన గేమ్ ప్లే ను ఉంచుతుంది మరియు స్టట్టరింగ్, ఇన్ పుట్ జాప్యం మరియు ఏఎండీ ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో సహాయం ద్వారా స్క్రీన్ టియరింగ్ ను తగ్గిస్తుంది.
ఒడిస్సీ జీ7
144 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840x2160 అధిక రిజల్యూషన్ తో, ఒడిస్సీ జీ7 ఎఫ్ హెచ్ డీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్ డెన్సిటీని ఇస్తుంది. ఇది మీడియా హబ్ ను సులభంగా చేరుకునే అవకాశం ఇచ్చి స్మార్ట్ వినోదానికి పరిపూర్ణమైన ఎంపికగా చేస్తుంది. కోర్ సింక్ ఫీచర్ గేమ్ యొక్క ఆన్-స్క్రీన్ రంగులతో లైటింగ్ కు జత అవుతుంది, మెరుగైన పిక్చర్ నాణ్యత ద్వారా గేమర్స్ కు మరింత లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
న్యూస్‌రూమ్ లింక్:
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్‌ను గురించి
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.