Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశపు సుప్రసిద్ధ సైన్స్ ఆధారిత ఆయుర్వేద కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్ నేడు తమ టూత్‌పేస్ట్ పోర్ట్‌ఫోలియోను డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ ఆవిష్కరణతో విస్తరించినట్లు వెల్లడించింది. ఈ వినూత్నమైన టూత్‌పేస్ట్‌ను ప్రత్యేకంగా వినియోగదారులకు తాజా, ఆరోగ్యవంతమైన నోటి సంరక్షణను అందించే రీతిలో తీర్చిదిద్దారు. డాబర్ ఇప్పుడు తమ డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ కోసం విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ భాగస్వామ్యం ప్రారంభంగా విజయ్‌దేవరకొండతో ఎట్రాక్షన్ మాగ్నెట్ నేపథ్యంతో ప్రచార చిత్రం విడుదల చేసింది.
డాబర్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్– మార్కెటింగ్ శ్రీ అభిషేక్ జుగ్రాన్ మాట్లాడుతూ ‘‘డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ టూత్‌పేస్ట్ విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ బ్రాండ్‌ను విజయ్ దేవర కొండ ప్రచారం చేయనున్నారు. వింటర్ గ్రీన్ ఆయిల్, మింట్, కలిగిన డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ టూత్‌పేస్ట్ క్లీనికల్‌గా 12 గంటల పాటు తాజా దనం అందిస్తుందని, ఆర్డనరీ టూత్ పేస్ట్‌తో పోలిస్తే 4 రెట్ల అధిక తాజాదనం ఇస్తుందని నిరూపితమైంది’’ అని అన్నారు. డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ టూత్‌పేస్ట్ 150 గ్రాముల ధర 100 రూపాయలు. అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వద్ద లభ్యమవుతుంది.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ డాబర్ కుటుంబంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉంది. డాబర్ రెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన, నమ్మకమైన బ్రాండ్. దీని ప్రొడక్ట్ నాణ్యత, సమర్థత పరంగా ఖ్యాతి గడించింది. డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ టూత్‌పేస్ట్ విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను’’అని అన్నారు. హవాస్ వరల్డ్ వైడ్ ఇండియా చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ అనుపమ రామస్వామి మాట్లాడుతూ ‘‘యువత కోరుకునే మాగ్నెటిజంను ఈ ప్రచారం ద్వారా వెలుగులోకి తీసుకురావాలనుకున్నాము. ఈ టీవీసీలో విజయ్ దేవరకొండ డాబర్ రెడ్ బే ఫ్రెష్ జెల్ టూత్‌పేస్ట్ శక్తిని వినియోగించుకుని 12 గంటల లోతైన తాజా శ్వాస ఆత్మవిశ్వాసవ అందిస్తుందనే సందేశం వెల్లడించనున్నారు’’ అని అన్నారు. TVC Link: LINK FOR TELGU TVC: https://youtu.be/gUWptXrs8tU