Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ హైదరాబాద్‌లోని కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ యొక్క నైపుణ్యాభివృద్ధి విభాగం, తమ విద్యార్ధులు విజయవంతంగా ఈసీ కౌన్సిల్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడాన్ని అభినందించింది. ఈ విద్యా సంస్ధ ఈసీ కౌన్సిల్ అకడమియా పార్టనర్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ విద్యార్ధుల నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ విభాగంలో అంతర్జాతీయ సర్టిఫికేషన్‌ను సైతం అందిస్తుంది. కెఎల్ వద్ద శిక్షణ పొందిన 25 మంది ఎలైట్ విద్యార్థులలో 16 మంది విద్యార్థులు అర్హత సాధించడంతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సీఈహెచ్ : సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ లెవల్ ఎల్ 2 సర్టిఫికేషన్’ను పొందారు. సైబర్ సెక్యూరిటీ విద్య మరియు అక్రిడిటేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధగా వెలుగొందుతున్న ఈసీ కౌన్సిల్, ఈసీ కౌన్సిల్ పార్టనర్స్ ప్రీమియం లీగ్ కు అకడమియా భాగస్వామిగా కెఎల్ యూనివర్శిటీని స్వాగతించింది. ఈ యూనివర్శిటీ ఇప్పుడు ఈసీ కౌన్సిల్ యొక్క ఏఎస్పీఈఎన్ పోర్టల్ మరియు సైబర్ సెక్యూరిటీ కెరీర్స్ పొందాలనుకునే తమ విద్యార్థులకు తగిన మద్దతునూ అందించేలా ఇతర వనరులనూ అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది.
కె ఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జి.పి సారధి వర్మ మాట్లాడుతూ ‘‘ కెఎల్ యూనివర్శిటీ వద్ద, మేము మా విద్యార్ధులకు , అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సైబర్ సెక్యూరిటీ రంగంలో విజయం సాధించేందుకు అవసరమైన విద్య మరియు వనరులను అందించేందుకు కృషి చేస్తున్నాము. ఈసీ–కౌన్సిల్ తో మా భాగస్వామ్యం, మా విద్యార్ధులు వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడాలనే మా నిబద్ధతను మరింతగా ప్రదర్శించడంతో పాటుగా సాంకేతిక ప్రపంచంలో సానుకూల ప్రభావాన్నీ సృష్టిస్తుంది. మా విద్యార్ధుల కృషి, పట్టుదల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భవిష్యత్‌లో వారు మరింతగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
సంవత్సరమంతా, సైబర్ సెక్యూరిటీ పరిశ్రమ వెబినార్లు , ఫస్ట్ లుక్ సెషన్లు మరియు వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా సైబర్ సెక్యూరిటీ వర్క్‌స్పేస్ గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా విద్యార్థులతో ఈసీ–కౌన్సిల్ ఏకమవుతుంది. కెఎల్ హెచ్ యొక్క అండర్గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ సైబర్ సెక్యూరిటీ కరిక్యులమ్ లో కోర్సు జోడించడంతో పాటుగా ఈసీ కౌన్సిల్ సర్టిఫికేషన్స్‌లో షార్ట్ టర్మ్ బూట్ క్యాంప్ శిక్షణ సైతం భాగం చేయడం ద్వారా ఈసీ–కౌన్సిల్ యొక్క ప్రపంచశ్రేణి సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లను ఈ యూనివర్శిటీ చేరుకునే అవకాశం ఉంది.
కెఎల్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ వద్ద సీఎస్ఈ డిపార్ట్మెంట్ కింద సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ రీసెర్చ్ గ్రూప్‌కు సైబర్ ఫారెన్సిక్స్ లో నిష్ణాతులు మరియు భారత ప్రభుత్వ ‘అంగుళి’ ప్రాజెక్ట్‌లో భాగమైన డాక్టర్ ఎస్ బాలాజీ నేతృత్వం వహిస్తున్నారు. సమాచార మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రత మరియు గోప్యత మెరుగుపరచడం పై ఈ గ్రూప్ పరిశోధనలు చేయడంతో పాటుగా భద్రత , గోప్యత సిద్ధాంతాలు, నేపథ్యాలు, పద్ధతులలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఈ గ్రూప్ ఇటీవలనే అంతర్జాతీయ సదస్సును ఎస్ఈఆర్బీ (SERB), ఇండియా భాగస్వామ్యంతో సైబర్ సెక్యూరిటీ ధోరణులపై నిర్వహించడం ద్వారా వాస్తవ ప్రపంచపు సైబర్ సెక్యూరిటీ సమస్యలు పరిష్కరించడంతో పాటుగా విద్య, ప్రభుత్వ, వ్యాపార, రక్షణ, సెక్యూరిటీ ఏజెన్సీలు, మీడియా, సామాన్య ప్రజానీకం నడుమ చర్చను ప్రోత్సహించింది.