Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షిత సాంకేతికతతో కూడిన వినూత్నమైన ఉత్పత్తి
- కఠినమైన రసాయనాలు, వేడి వినియోగం తగ్గించడం ద్వారా మీ హెయిర్‌స్టైలింగ్ అనుభవాలకు అత్యంత అందుబాటులోని జోడింపుగా నిలుస్తుంది
- జుట్టు కుదుళ్లు మరియు జుట్టు చిట్లడం నివారించేలా పరీక్షలు
- భారతదేశంలో వెస్టిజ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ ద్వారా విక్రయించనున్నారు
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా వినూత్నమైన సాంకేతికతతో కూడిన ఉత్పత్తులు, పరిష్కారాల ద్వారా ప్రాచుర్యం పొందిన షార్ప్ కార్పోరేషన్, జపాన్ కు పూర్తి సొంతమైన భారతీయ అనుబంధ సంస్థ షార్ప్, తమ షార్ప్ ప్లాస్మాక్లస్టర్ హెయిర్ డ్రైయర్‌ను విడుదల చేసింది. ఈ ప్రీమియం హెయిర్ డ్రైయర్‌ను వెస్టిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా పరిచయం చేశారు. ఇంటి వద్దనే గ్రూమింగ్ సేవలను కోరుకుంటున్న వినియోగదారుల అవసరాలను తీర్చే క్రమంలో ఈ నూతన హెయిర్ డ్రైయర్‌లో షార్ప్ యొక్క అసలైన, పేటెంటెడ్ ప్లాస్మాక్టస్టర్ సాంకేతికతతో పాటుగా అత్యద్భుతమైన విండ్ఫ్లో వ్యవస్ధను సైతం జోడించారు. జుట్టును మృదువుగా చేయడం, జుట్టు కుదుళ్లకు నష్టం తగ్గించడం మరియు జుట్టు చివర చిట్లడం తగ్గించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన స్కాల్ప్‌కు తోడ్పడటం ద్వారా వినియోగదారులకు అత్యున్నత అనుభవాలను అందించేందుకు తీర్చిదిద్దారు.
దాదాపు 100 సంవత్సరాలుగా సాంకేతిక వ్యాపారాన్ని కొనసాగిస్తున్న షార్ప్, ఈ ఆవిష్కరణతో తమ వినూత్నమైన ప్లాస్మాక్లస్టర్ సాంకేతిక హెయిర్ డ్రైయర్‌ను భారతదేశానికి తొలిసారి తీసుకువచ్చింది. అత్యంత సౌకర్యవంతమైన రూపం మరియు ఆకర్షణీయమైన రోజ్ పింక్ ఎక్స్టీరియర్తో వస్తున్న ఈ నూతన ప్లాస్మా క్లస్టర్ హెయిర్ డ్రైయర్ , వాటర్ –ట్రాప్డ్ నేచురల్ అయాన్స్ను విడుదల చేస్తుంది. దీని కారణంగా జుట్టు మరియు స్కాల్ప్ మాయిశ్చర్ బ్యాలెన్స్ దాదాపు 16% వృద్ధి చెందుతుంది. ఈ ప్రయోజనాలు ఈ హెయిర్ డ్రైయర్‌ను మార్కెట్లో విభిన్నంగా నిలుపుతాయి.
కేవలం 535 గ్రాముల బరువు ఉండే ఈ హెయిర్ డ్రైయర్, ఈ విభాగంలో అతి తేలికైనది. అతి సులభంగా వినియోగించ తగిన రీతిలో ఉండటం వల్ల షార్ప్ ప్లాస్మాక్లస్టర్ హెయిర్ డ్రైయర్ చిన్నారులకు అత్యంత సురక్షితంగా ఉంటుంది. టర్బో మోడ్ తో వినియోగదారులు జుట్టు, స్కాల్ప్‌ను అధికవేడి లేకుండానే ఆరబెట్టుకోవచ్చు. దీనిలోని కోల్డ్ మోడ్ జుట్టుకుదుళ్లను బిగుతుగా మార్చి స్టైలింగ్ పీరియడ్‌ను విస్తరించవచ్చు.
ఈ ఆవిష్కరణ గురించి షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నరితా ఒసాము మాట్లాడుతూ ‘‘సాంకేతికత పరిధి విస్తరించడంతో పాటుగా వినియోగదారులకు ఆవిష్కరణలను తీసుకురావడంలో షార్ప్ ఎప్పుడూ ముందే ఉంటుంది. మా ప్రీమియం షార్ప్ ప్లాస్మాక్లస్టర్ హెయిర్ డ్రైయర్ విడుదలతో జుట్టుకు నష్టం కలిగించకుండా కోరుకున్న శైలి రావాలనుకునే మా వినియోగదారుల అంచనాలను అందుకోగలమని ఆశిస్తున్నాము. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ తో చేసిన మా వినూత్నమైన పరిశోధన, అభివృద్ది మా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నాము. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ వెస్టిజ్ ద్వారా ఈ ఉత్పత్తి ఆవిష్కరించడం వల్ల మరింత మందికి చేరువకాగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
వెస్టిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలీమాట్లాడుతూ‘‘భారతీయమార్కెట్లో అత్యంత నమ్మకమైన పేరు షార్ప్. వారితో కలిసి దేశవ్యాప్తంగా మా లీడర్స్,డిస్ట్రిబ్యూటర్ల కు విప్లవాత్మక ప్లాస్మాక్లస్టర్ హెయిర్ డ్రైయర్‌ను అందిస్తుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాము. ఈ జోడింపుతో, పలు ప్రాంతాలలోని మా వినియోగదారులు బ్యూటీ, వెల్నెస్ పరిష్కారాల పరంగా సాటిలేని షాపింగ్ అనుభవాలను పొందగలరు’’ అని అన్నారు.