Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచురించిన ప్రపంచంలో సుప్రసిద్ధ మల్టీ డిసిస్లీనరీ సైన్స్ జర్నల్, నేచర్
నవతెలంగాణ - హైదరాబాద్
ఇటీవల నేచర్ జర్నల్‌లో ప్రచురించిన శాస్త్రీయ నివేదికలో రానిటిడిన్ మరియు క్యాన్సర్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడైంది. రానిటిడిన్ను గ్యాస్ట్రిక్ అల్సర్ల చికిత్స కోసం వినియోగిస్తుంటారు. ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం 12,680 మంది రానిటిడిన్ వినియోగదారులు మరియు 12, 680 మంది హెచ్2ఆర్ఏ (రానిటిడిన్ తరహా ఔషదాలు) వినియోగదారులను పరిశీలించారు.
ఈ అధ్యయనాన్ని దక్షిణ కొరియాలో చేశారు. తద్వారా క్యాన్సర్ మరియు రానిటిడిన్ మధ్య గల సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం మరింతగా ఈ ఫలితాలు ధృవీకరిస్తుంది. నేచర్ అనేది వీక్లీ ఇంటర్నేషనల్ జర్నల్. అత్యున్నత పరిశోధనా ఆవిష్కరణలను ఇది సైన్స్, టెక్నాలజీ రంగాలలో ప్రచురిస్తుంటుంది. ఈ సంస్ధ వెబ్సైట్లో ప్రచురితమైన డాటా ప్రకారం తమకు వచ్చిన ఆర్టికల్స్‌లో కేవలం 7% నుంచి 8% మాత్రమే ఎడిటోరియల్ సమీక్ష తరువాత ప్రచురణార్హత కలిగి ఉంటాయి. ఎన్–నైట్రోసో డిమెథిలమైన్ (ఎన్డీఎంఏ) అనేది సంభావ్య మానవ క్యాన్సర్ కారకం. లేబరేటరీ అధ్యయనాల ప్రకారం, ఇది మానవులపై ప్రభావం చూపుతుంది. 2019లో రానిటిడిన్ ఉత్పత్తులలో మోతాదుకు మించి ఎన్డీఎంఏ కనుగొన్నట్లుగా కనుగొనడంతో మార్కెట్ నుంచి రానిటిడిన్ ను ఉపసంహరించారు.
ఈ అధ్యయనం, రానిటిడిన్‌తో క్యాన్సర్‌కు గల సంబంధాన్ని గురించి రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని సుంగ్క్యున్క్వాన్ యూనివర్శిటీ –సియోల్‌లో లీడ్ రీసెర్చర్ జు–యంగ్ షిన్ మాట్లాడుతూ ఎన్డీఎంఏ మలినాలతో కూడిన రానిటిడిన్ కు క్యాన్సర్‌కు సంబంధం లేదని మేము గుర్తించాము అని అన్నారు. ‘‘గత మూడు సంవత్సరాలుగా రానిటిడిన్,దానితో క్యాన్సర్‌కు ఉన్న బంధం గురించి చర్చ జరుగుతుంది. అయితే, ఈ ఔషదం మార్కెట్లో నాలుగు దశాబ్దాలుగా ఉంది. అజీర్ణం, గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు దీనిని వాడుతున్నారు. నేచర్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇది సురక్షితమైన ఔషదం అని, క్యాన్సర్‌తో సంబంధం లేదని తెలుపుతుంది’’ అని డాక్టర్ శ్రీహరి టి, వామన్ సాగర్ క్లీనిక్ , హైదరాబాద్ అన్నారు. ‘గతంలో కనుగొన్నట్లుగా రానిటిడిన్ మరియు క్యాన్సర్‌కు సంబంధం లేదని దక్షిణ కొరియా పరిశోధకుల అధ్యయనాలు నిర్ధారించాయి. ఈ మాలిక్యుల్‌కు 43 సంవత్సరాల చరిత్ర ఉంది. అందుబాటులోని శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఇది సురక్షితమైనది’’ అని డాక్టర్ రెజినాల్డ్ డీ లామ్, ల్యాప్రోస్కోపిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, సత్య వేద మెడికల్ సెంటర్, అమీర్‌పేట అన్నారు.