Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన, డిజిటల్ ఆధారిత సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించిన శ్రీ ఆనంద్ మహీంద్రా
- భావి విస్తరణ ప్రణాళికలు మరియ విద్యాభాగాస్వామ్యాలు చర్చించారు
- వినూత్నమైన, పరిశ్రమ సంబంధిత ప్రాజెక్టులను విద్యార్ధులు ప్రదర్శించారు
నవతెలంగాణ - హైదరాబాద్
మహీంద్రా యూనివర్శిటీ యొక్క ఏడవ గవర్నింగ్ బాడీ సమావేశం ఇటీవల జరిగింది. మహీంద్రా యూనివర్శిటీ ఛాన్స్లర్ శ్రీ ఆనంద్ మహీంద్రా తో పాటుగా బోర్డ్ సభ్యులు శ్రీ వినీత్ నయ్యర్, పూర్వ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, టెక్ మహీంద్రా ; శ్రీ సీపీ గుర్నానీ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – మేనేజింగ్ డైరెక్టర్, టెక్ మహీంద్రా ; డాక్టర్ యాజులు మేడూరి, వైస్ ఛాన్స్లర్, మహీంద్రా యూనివర్శిటీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు భావి విస్తరణ ప్రణాళికలు, ఇతర విద్యా భాగస్వామ్యాలను గురించి చర్చించారు.
ఈకోల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్ధులు /ఫ్యాకల్టీ వినూత్నమైన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లలో బై–డైరెక్షనల్ చార్జర్ వంటివి సైతం ఉన్నాయి. రోబోటిక్స్ ల్యాబ్‌కు చెందిన విద్యార్ధులు హ్యూమన్ ఆర్మ్ రీహాబిలిటేషన్ కోసం ఎక్సో–సూట్ డెమో ఇచ్చారు. వీటితో పాటుగా అటానమస్ గైడెడ్ వెహికల్ , లగోరీ కోసం ప్రోజెక్టైల్ లాంచర్ వంటివి ప్రదర్శించారు. శ్రీ ఆనంద్ మహీంద్రా , యూనివర్శిటీ సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించారు. ఈ నూతనడిజిటల్ లైబ్రరీలో ఆర్ఎఫ్ఐడీ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్ధ ఉంది. ఈ వై ఫై ఆధారిత లైబ్రరీలో ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం ఇక్కడ ఉన్నాయి.