Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ జీబ్రానిక్ భారత్లో జెబ్-రాకెట్ 500 కొత్త బ్లూటూత్ స్పీకరన్ను ఆవిష్కరించింది. ప్రముఖ డీసీ పాత్రలు ది జోకర్, బ్లాక్ ఆడమ్ ల ప్రేరణతో దీనిని రూపొందించారు. దీనిని జీబ్రానిక్స్ డైరెక్టర్ యష్ దోషి ఆవిష్కరించారు. ఇంటా, బయట ఉపయోగించే విధంగా కొత్త ఫీచర్లతో దీనిని తయారు చేశారు. ఇన్బిల్ట్ బ్యాటరీ, 20 వాట్ల అవుట్పుట్ పవర్ ఇందులో ఉన్నది. ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ ఈనెల 17 నుంచి అమెజాన్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 3199.