Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రాజమండ్రి: భారతదేశంలో అతిపెద్ద ఆతిథ్య కంపెనీ , ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) నేడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో తమ మొదటి హోటల్ కోసం ఒప్పందం పై సంతకాలు చేసింది. గ్రీన్‌ఫీల్డ్ హోటల్‌ను వివాంతా బ్రాండ్‌గా మార్చనున్నారు. ఐహెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్– రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్ సుమ వెంకటేష్ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయాలనే ఐహెచ్‌సీఎల్ వ్యూహానికనుగుణంగా ఈ ఒప్పందం ఉంటుంది. భారీ పరిశ్రమలకు నిలయం రాజమండ్రి. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద ఆఫ్‌షోర్ గ్యాస్ ఫీల్డ్స్‌కూ సమీపంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద బులియన్ కేంద్రాలలో ఇది ఒకటి. శైలజ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఈ నగరంలో వివాంతా హోటల్ ఏర్పాటుకోసం ఒప్పందం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’అని అన్నారు.
రాజమండ్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యంత సౌకర్యవంతమైన దూరంలో ఈ 120 గదుల హోటల్ ఉంది. ఈ హోటల్ దిగుమతి నౌకాశ్రయ నగరం కాకినాడ కు సైతం దగ్గరగానే ఉంటుంది. ఈ హోటల్లో సిగ్నేచర్ రెస్టారెంట్ మింట్, ఓ బార్, రిక్రియేషనల్ సదుపాయాలు ఉంటాయి. వీటిలో స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్ సైతం ఉంటాయి. దీనిలో 550 చదరపు మీటర్ల బాంక్విట్ ప్రాంగణం సైతం సహా మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. శైలజ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ చక్కా సుబ్బారావు మాట్లాడుతూ ‘‘తమ సేవా విలువల ద్వారా ఐహెచ్‌సీఎల్ సుప్రసిద్ధమైనది. ఈ కంపెనీతో కలిసి పనిచేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను మరియు అతిథులకు అత్యంత ఆకర్షణీయమైన వివాంతా బ్రాండ్‌ను రాజమండ్రిలో అందించనున్నాము’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఉద్యానవనాలకు ఖ్యాతి గడించిన ఈ నగరాన్ని భారతదేశపు నర్సరీ క్యాపిటల్‌గా కూడా చెబుతుంటారు. ఈ హోటల్ జోడింపుతో, ఐహెచ్‌సీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో ఆరు హోటల్స్ , తాజ్, వివాంతా, సెలక్షన్స్, జింజర్ బ్రాండ్లలో ఉన్నాయి. వీటిలో రెండు హోటల్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి.