Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్‌తో రూపాయి విలువ 14 పైసలు పతనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి మారకం విలువ మళ్లీ ఒత్తిడికి గురి అవుతోంది. శుక్రవారం సెషన్లో డాలర్‌తో రూపాయి విలువ 14 పైసలు కోల్పోయి 82.84కు దిగజారింది. ఉదయం ఇంతక్రితం సెషన్లో 82.70 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లలో స్తబ్దత, ఎఫ్ఐఐల రాకలో తగ్గుదల రూపాయిని ఒత్తిడికి గురి చేస్తుంది. డాలర్ విలువ పెరగడం, ఆసియన్ మార్కెట్ల పతనం రూపాయి విలువపై ఒత్తిడిని పెంచుతుందని బీఎన్పీ పరిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరీ పేర్కొన్నారు. డాలర్ పటిష్టం కావడం ద్వారా రూపాయి విలువ మరింత పడిపోవచ్చన్నారు.