Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వర్థమాన్ (మహిళ) కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ తన 54వ జనరల్ బాడి సమా వేశాన్ని నిర్వహించుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశానికి హాజరైన డైరెక్టర్లు, సభ్యులకు ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎడిఎన్వి ప్రసాద్ స్వాగతం పలికారు. దీనికి ఛైర్మన్ రితేష్ కుమార్ డాగ, ఇతర డైరెక్టర్లు నిర్మలా డాగ, రాజ్ కుమారి చౌర్డియా, తుషార్ సల్వా, మహేందర్ కుమార్ జైన్ గొలెచ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీనియర్ వైస్ ఛైర్మన్ నిర్మల డాగ మాట్లాడుతూ.. 2023 మార్చి ముగింపు నాటికి పెట్టుకున్న రూ.800 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని చేరనున్నామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఏడాది బ్యాంక్ మెరుగైన ప్రగతిని నమోదు చేస్తుందని ఛైర్మన్ రితేష్ కుమార్ పేర్కొన్నారు.