Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లోకి విడుదల చేసిన తెలంగాణ జోనల్ మేనేజర్ ఇస్మాయిల్ఖాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ స్కూటర్ విభాగంలో వెలుగొందుతున్న హౌండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) స్మార్టర్ అత్యాధునిక యాక్టివా 2023ను విడుదల చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో హెచ్ఎంఎస్ఐ తెలంగాణ జోనల్ మేనేజర్ ఇస్మాయిల్ఖాన్, హైదరాబాద్ ఏరియా మేనేజర్లు సునీల్‌రెడ్డి పునీత్‌కుమార్ సీఎస్‌తో పాటుగా హౌండా డీలర్లు మార్కెట్లోకి దాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ఖాన్ మాట్లాడుతూ..ఇది హెచ్ఎంఎస్ఐ యొక్క మొట్టమొదటి ఓడీబీ2 ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనం అని తెలిపారు. సాంకేతికత పరంగా ముందుండే హెచ్ఎంఎస్ఐ వినియోగదారులకు సౌకర్యం, సౌలభ్యాన్ని వారి రోజువారీ జీవితాలలో అందిస్తున్నదని తెలిపారు. ద్విచక్ర వాహన విభాగంలో మొట్టమొదటిసారిగా వినూత్నమైన ఫీచర్, స్మార్ట్ కీతో నూతనయాక్టివా ఉంటుందని చెప్పారు. ఈ వాహనం అన్ని హౌండా టచ్పాయింట్ల వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.