Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్ వెల్లడి
జైపూర్ : దేశంలో పెరుగుతున్న ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జైపూర్లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించనున్నట్టు తెలిపారు. పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించనున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడానికి పప్పుల సాగును పెంచాలని నిర్ణయించామన్నారు. తాత్కాలికంగా పప్పు ధాన్యాల కొరతను అధిగమించేందుకు కంది, పెసర వంటి పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఒక అంకెకు లేదా పూర్తిగా తొలగించే యోచన చేస్తున్నామన్నారు.