Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగర కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్టెక్ సంస్థ నెక్ట్స్ వేవ్ తాజా ఫండింగ్ రౌండ్లో రూ.275 కోట్ల నిధులను సమీకరించినట్టు తెలిపింది. ఈ రౌండ్‌కి అంతర్జాతీయ ప్రయివేటు ఈక్విటీ సంస్ధ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జీపీసీ నేతృత్వం వహించిందని పేర్కొంది. ప్రస్తుత వెంచర్ ఇన్వెస్టర్ ఓరియోస్ వెంచర్ పార్టనర్స్ సైతం ఈ రౌండ్లో పాల్గొందని తెలిపింది. తెలుగు విద్యార్థలు నెక్ట్స్ వేవ్‌ను రూపొందించారు. అధునిక టెక్నలాజీ కెరీర్స్‌కు అభ్యర్థులను సిద్ధం చేసే భారతదేశపు అతి పెద్ద అన్లైన్ ఎంప్లాయిబిలిటీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తున్నారు. గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్థి చెందుతున్న స్టార్టప్స్ మొదలుకొని ఫార్చ్యూన్ 500 సంస్ధల వరకు 1250కు పైగా కంపెనీలు తమ విద్యార్థులను నియమించుకున్నాయని ఆ సంస్థ సిఇఒ, ఫౌండర్ రాహుల్ అత్తులూరి పేర్కొన్నారు.