Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ద్విచక్ర వాహన ట్యాక్సీలను రద్దు చేస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో తదితర క్యాబ్ అగ్రిగేటర్లు నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన వాహనాలను ట్యాక్సీల కోసం వినియోగిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ రవాణ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలను ట్యాక్సీల కోసం వాడటం మోటారు వాహనాల చట్టం 1988ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరించింది. డ్రైవింగ్ లైసెన్సును మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తామని తెలిపింది.