Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మొబైల్ తయారీ కంపెనీ పోకో తన సి-సిరీస్‌లో కొత్త సీ55ను ఆవిష్కరించింది. 50 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా, లెదర్ స్టిచ్ ఫినిషింగ్, ఫాస్ట్‌ఛార్జింగ్ సదుపాయం, ఫింగర్‌ప్రింట్, స్కానర్ తదితర ఫీచర్లతో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. రెండు వేరియంట్లలో దీన్ని విడుదల చేసింది. 4జిబి, 64జిబి వేరియంట్ ధరను రూ.9,499గా, 6జిబి, 128జిబి వేరియింట్ ధరను రూ.10,999గా నిర్ణయించింది. ఫిబ్రవరి 28 నుంచి ఫ్లిప్‌కార్ట్, పోకో వెబ్సైట్లలో అమ్మకాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. పలు కార్డులపై ఆఫర్లను అందిస్తున్నట్టు పేర్కొంది.