Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారి ఛార్జ్‌తో 80 కిలోమీటర్లు
న్యూఢిల్లీ: విద్యుత్ వాహన బ్రాండ్ ఒకాయ ఈవీ మార్కెట్లోకి కొత్తగా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్‌ను విడుదల చేసినట్టు ప్రకటించింది. ఈ వాహ నాన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70-80 కిలోమీటర్లు ప్రయాణించ డానికి వీలుందని ఆ సంస్థ పేర్కొంది. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపింది. ఆరు రంగుల్లో లభించే దీని ఎక్స్‌షోరూం ధరను రూ.83,999గా నిర్ణయించినట్టు ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎండీ అన్షుల్ గుప్తా పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యత, విశ్వసనీయమైన ఈవీల కోసం అనేక ఉన్నత ప్రమాణాలను పాటించామని ఆయన తెలిపారు.