Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభ ధర రూ.24 లక్షలు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ మోటో రడ్ తన 100 ఏండ్ల వార్షికోత్సవం సందర్బంగా స్పెషల్ ఎడిషన్‌లో రెండు కొత్త వేరియంట్ బైకులను ఆవిష్కరించింది. ఆర్ నైన్‌టి 100 హియర్స్, ఆర్ 18 100 హియర్స్ మోడళ్లను విడుదల చేసింది. ఈ బైకులను 1923 చొప్పున మాత్రమే తయారు చేసి విక్రయించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. 1923లో ఈ కంపెనీ ప్రారంభించిన సందర్బంగా.. చరిత్రలో మిగిలిపోయేలా వీటిని డిజైన్ చేసినట్టు తెలిపింది. భారత్‌లో ఆర్నైన్ టి ఎక్స్‌షోరూం ధరను రూ.24 లక్షలుగా, ఆర్ 18 100 ధరను రూ.25,90,000గా నిర్ణయించింది. ''100 ఏండ్ల క్రితం బీఎండబ్ల్యూ ఆర్ 32 కిక్‌తో ప్రారంభమైన తమ ప్రయాణం ఇప్పుడు ఓ విజయవంతమైన స్టోరీగా నిలిచింది. ఈ రెండు కొత్త వేరియంట్లను 1,923 యూనిట్ల చొప్పున మాత్రమే విడుదల చేస్తున్నాం'' అని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావ్ పేర్కొన్నారు.