Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జాక్‌మాకు చెందిన ఫిన్‌టెక్ సంస్థ ఆంట్ గ్రూప్ పేటియంలో వాటాలను విక్రయించనుందని రిపోర్టులు వస్తున్నాయి. షేర్ల బైబ్యాక్ తో పేటియంలో ఆంట్ గ్రూప్ వాటా పెరిగింది. ఇలా పెరిగిన వాటాలను విక్రయించాలని ఆంట్ గ్రూప్ భావిస్తుందని తెలుస్తోంది. షేర్ ధర, రెగ్యులేటరీ సంస్థల అనుమతులను బట్టి ఎంత వాటా విక్రయించాలన్న విషయమై రెండు సంస్థలు ఓ నిర్ణయానికి వస్తాయని సమాచారం. దీనిపై ఇరు సంస్థలు స్పందించలేదు. ఆంట్ గ్రూపు వాటాల అమ్మకాలు జరిగితే ఇప్పటికే గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పేటియం షేర్ల పరపతి ఎలా ఉంటుందో వేచి చూడాలి.