Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోటి మంది 5జి వినియోగదారుల మైలురాయిని చేరినట్లు ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ సేవలను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే ఈ స్థాయికి చేరడం ఎంతో సంతోషంగా ఉందని ఆ కంపెనీ పేర్కొంది. మార్చి 2024 కల్లా దేశంలోని ప్రతీ పట్టణంలో, కీలక గ్రామీణ ప్రాంతాల్లో 5జి సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్ 1న ఈ సేవలు ప్రారంభించింది.