Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ఇవి స్టార్టప్ సంస్థ రివర్ మార్కెట్లోకి కొత్తగా 'ఇండీ' పేరుతో విద్యుత్ స్కూటర్లను విడుదల చేసినట్లు తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న తమ సంస్థ స్కూటర్లలో ఎస్యువి వంటి స్కూటర్‌ను ఆవిష్కరించిందని పేర్కొంది. ఈ స్కూటర్‌ను తమ ఫ్యాక్టరీలోనే విప్లవాత్మకమైన డిజైన్, మునుపెన్నడూ చూడని లక్షణాలతో స్కూటర్ యొక్క వినియోగాన్ని పెంపొందించేలా తయారు చేసినట్లు వెల్లడించింది. తొలిసారి 14 అంగుళాల పెద్ద చక్రాన్ని 'రివర్' అందిస్తోందని పేర్కొంది. స్కూటర్లన్నింటిలోకి అత్యధిక స్టోరేజ్ అయిన 43 లీటర్ల సీట్ అడుగు స్టోరేజ్, 12 లీటర్ల ముందు గ్లోవ్ బాక్స్ స్టోరేజ్ దీని ప్రత్యేకతని రివర్ సహ వ్యవస్థాపకులు విపిన్ జార్జ్ తెలిపారు. దీని ధరను రూ.1,25,000గా నిర్ణయించింది. ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తున్నామని, ఆగస్టు నుంచి డెలివరీలను ప్రారంభిస్తామని జార్జ్ తెలిపారు.