Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణమూర్తి వెల్లడి
న్యూఢిల్లీ : మనుషులు చేసే పనిని కృత్రిమ మేథస్సు (ఎఐ) భర్తి చేయలేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు. మంగళవారం ఆయన ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మాట్లాడుతూ.. చాట్‌జిపిటి తరహా ఎఐలు మనుషుల పనులను భర్తీ చేయ లేవన్నారు. అయితే.. సాంకేతికత వల్ల మనుషుల జీవితం మరింత సులభ తరం కానుందన్నారు. కంప్యూటర్ వచ్చిన తొలి రోజుల్లో ఇలాంటి అభిప్రా యాలే వచ్చాయని.. కానీ అవి మన జీవితాన్ని సులభతరం చేశాయన్నారు. ఎఐ వల్ల మనిషికి మరింత ఖాళీ సమయం దొరకుతుందన్నారు.
చాట్‌జిపిటిలో ఉద్వాసనలు
కొద్ది రోజుల్లోనే ఎఐ టూల్ చాట్‌జిపిటి విశేష గుర్తింపు పొందిన ప్పటికీ.. తాజాగా ఆ సంస్థలోనూ ఉద్యోగులకు ఉద్వాసనలు ఉండబోతు న్నాయని రిపోర్టులు వస్తున్నాయి. చాట్‌జిపిటిలో క్రమంగా ఉద్యోగాలను తిరిగి తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.