Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 200 లుపిమిత్రల ఏర్పాటు
- లూపిన్ డయాగ్నోస్టిక్స్ వెల్లడి
హైదరాబాద్ : అంతర్జాతీయ ఫార్మా కంపెనీ లుపిన్ లిమిటెడ్ (లుపిన్) తమ నూతన ప్రాంతీయ రెఫరెన్స్ లేబరేటరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లూపిన్ లిమిటెడ్ కమ్యూనికేషన్ అండ్ సస్టెయినిబిలిటీ గ్లోబల్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ శ్వేత ముంజల్‌తో కలిసి ఆ కంపెనీ సిఇఒ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తమ సంస్థకు 380కు పైగా లుపి మిత్రా (లుపిన్ యొక్క ఫ్రాంచైజీ కలెక్షన్ కేంద్రాలు), 23 లేబరేటరీలు ఉన్నాయన్నారు. 24వ లాబరేటరీని బాలానగర్‌లో ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు నాటికి దక్షిణాదిలో 200 లుపి మిత్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఏడాదిలోగా విజయవాడలోనూ ఒక్క లేబరేటరీని ఏర్పాటు చేయనున్నామన్నారు. చికిత్సలో ప్రస్తుతం రోగ నిర్థారణ పరీక్షలు అత్యంత కీలకంగా మారాయన్నారు. తమ ల్యాబ్‌ల్లో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన పరీక్షా ఫలితాలను అందించేందుకు ఉన్నత ప్రక్రియలను అనుసరిస్తామన్నారు.