Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇన్నోవేషన్, లీడ్ టెక్ స్టార్టప్ తొలిసారి గేర్లతో కూడిన మోటర్ సైకిల్‌ను విడుదల చేసింది. ఎరా (ఎఇఆర్‌ఎ) పేరుతో దీన్ని బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. దేశ వ్యాప్తంగా ఎరా 4000 ధరను రూ.1.43 లక్షలుగా, ఎరా 5000 ధరను రూ.1.54 లక్షలుగా నిర్ణయించింది. ఎరా నాలుగు వేరియంట్లలో లభిస్తుందని మేటర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సిఇఒ మోహల్ లాల్భారు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో వినియోగదారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అందుబాటు ధరలోనే థ్రిల్లింగ్ పనితీరును అందిస్తున్నామన్నారు. మేటర్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సిటిఒ కుమార్ ప్రసాద్ తెలికేపల్లి మాట్లాడుతూ.. మేటర్ ద్వారా కొత్త మొబిలిటీ రూపాలు, అనుభవాలను రూపొందించడానికి సాంకేతికత ఆవిష్కరణలతో నిరంతరం పని చేయాలనుకుంటున్నామన్నారు.