Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా ప్రధాన మద్దతును అందిస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభం నుండి ఇప్పటికీ చైనా వృద్థి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా ఉందని చైనా డైలీ ఓ కథనంలో పేర్కొంది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నప్పటికీ.. చైనాలో జిడిపి తగ్గినప్పటికీ.. తమ దేశమే దిక్సూచిగా ఉందని తెలిపింది. చైనా ఆర్థిక విధానం, డిజిటలైజేషన్ అంశాలు దేశీయ స్థిరమైన ఆర్థిక వద్ధికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. ''కొత్తగా మధ్య తరగతిలో డిమాండ్ పెరిగిందని తెలిపింది. చైనా డైలీ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచంలోనే చైనా రెండో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా ఉంది. అతిపెద్ద ఇ-కామర్స్ వ్యవస్థను కలిగి ఉంది. 2022లో చైనా 3 శాతం వృద్థితో 17.42 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరింది. 2021లో విడుదలైన మెకిన్సే నివేదిక ప్రకారం.. ఎగువ-మధ్య-ఆదాయ వర్గాల్లోని వినియోగదారులు వచ్చే దశాబ్దంలో చైనాలో సింహభాగం వద్ధిని నడిపించే అవకాశం ఉంది. 2030 నాటికి, పట్టణ వినియోగంలో దాదాపు 60 శాతం ఉన్నత, మధ్య ఆదాయ వినియోగదారులచే నడపబడుతుందని అంచనా వేయబడింది. వార్షిక గృహ ఆదాయాలు 1,60,000 యువాన్ల నుండి 3,45,000 యువాన్ల వరకు పెరుగొచ్చని అంచనా. ఇవి ఆర్థిక వ్యవస్థలో వినిమయం, డిమాండ్‌ను పెంచనున్నాయి.