Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), మరియు భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు నేడు భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కో-బ్రాండెడ్ ట్రావెల్ కార్డులను విడుదల చేసేందుకు భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఐఆర్టీసీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌గా వ్యవహరించే ఈ కో-బ్రాండెడ్ కార్డ్ ఒకే వేరియంట్లో ఉంటుంది ఎన్పీసీఐ రూపే నెట్‌వర్క్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఇది ఐఆర్సీటీసీ టికెటింగ్ వెబ్సైట్ ద్వారా మరియు ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైలు టిక్కెట్ల బుకింగ్‌లపై ప్రత్యేక ప్రయోజనాలను, గరిష్ట ఆదాను అందిస్తుంది. అదనంగా, ఐఆర్సీటీసీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆకర్షణీయమైన జాయినింగ్ బోనస్, రైల్వే బుకింగ్‌లపై తగ్గింపులు మరియు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలోని అనేక ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లకు యాక్సెస్ పొందుతారు. ఈ కార్డ్ రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్ల బలాన్ని అనుసంధానం చేసి, ప్రయాణికులకు అత్యుత్తమ విలువను, మెరుగైన వినియోగదారుని అనుభవాన్ని అందిస్తుంది. ఇది దేశంలో కార్డుల జారీలో మార్కెట్లో అగ్రగామిగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నైపుణ్యాన్ని, తన బెస్ట్-ఇన్-క్లాస్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను మరియు రైలు ప్రయాణంలో ఐఆర్సీటీసీ సాటిలేని సేవలను అందుకునేందుకు అనుమతిస్తుంది. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా, పరాగ్ రావు, గ్రూప్ హెడ్ - పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఐటీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరియు ఎన్పీసీఐ, సీఓఓ ప్రవీణా రాయ్ ఈ క్రెడిట్ కార్డ్‌ను విడుదల చేశారు. భాగస్వామ్యం గురించి ఐఆర్సీటీసీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా మాట్లాడుతూ, ‘‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు దేశంలోని అతిపెద్ద మరియు అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో ఒకటి. ఈ కార్డును అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వారితో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. కో-బ్రాండెడ్ కార్డ్ చాలా ప్రధాన రైల్వే స్టేషన్లలో కొత్తగా ప్రారంభించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లాంజ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఆన్లైన్ లావాదేవీలను క్రమబద్ధీకరించేందుకు క్రెడిట్ కార్డ్ సహాయపడుతుంది. అదే సమయంలో మా వినియోగదారులకు బెస్ట్-ఇన్-క్లాస్ ప్రయోజనాలను, అనుభవాన్ని అందిస్తుంది’’ అని వివరించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పేమెంట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఐటి గ్రూప్ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, ‘‘హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ దేశానికి అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది. ఐఆర్సీటీసీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భారతీయులకు సేవలను అందించేందుకు సహాయపడుతుంది. భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి మరియు రైలు ప్రయాణికులకు వారి టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పటి నుంచి వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరచేందుకు ఐఆర్టీసీతో భాగస్వామిగా ఉన్న మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవతరించడం ఆనందంగా ఉంది. భారతదేశంలో చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచేందుకు, మద్దతు ఇచ్చేందుకు కొత్త మార్గాలను కనుగొనడం మా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాము’’ అని వివరించారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ మాట్లాడుతూ, “రూపేలో మేము మా అన్ని ఆఫర్లు మరియు వినియోగదారులను హృదయంలో ఉంచుకుని ఆవిష్కరణలు చేస్తున్నాము. కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం ఐఆర్సీటీసీ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఇది రైలు ప్రయాణం, వారి షాపింగ్ అవసరాల కోసం వినియోగదారులకు వేగవంతమైన చెల్లింపు సౌలభ్యం మరియు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. రూపే క్రెడిట్ కార్డ్‌లు ఇప్పుడు చెల్లింపుల కోసం యూపీఐలో అందుబాటులోకి రావగంతో, ఈ కోబ్రాండెడ్ కార్డు భారతదేశం వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను మరింత స్వీకరించేందుకు, చేరుకునేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది’’ అని వివరించారు.
ఐఆర్సీటీసీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కో బ్రాండ్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఐఆర్సీటీసీ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెబ్సైట్ల ద్వారా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సరళమైన మరియు మరింత రివార్డింగ్ అనుభవాన్ని ఆస్వాదిస్తూ, యాప్ ద్వారా కార్డ్ ముఖ్య వివరాలను యాక్సెస్ చేయవచ్చు. వారు కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమీపంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు శాఖకు కూడా వెళ్లవచ్చు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) అనేది రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘‘మినీ రత్న (కేటగిరీ-I)’’ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. రైల్వే స్టేషన్లు, రైళ్లు మరియు ఇతర ప్రదేశాలలో క్యాటరింగ్, ఆతిథ్య సేవలను అప్‌గ్రేడ్ చేసేందుకు, వృత్తిపరంగా మరియు నిర్వహణకు మరియు బడ్జెట్ హోటల్లు, ప్రత్యేక పర్యటనల ప్యాకేజీలు, సమాచారం & వాణిజ్య ప్రచారం మరియు ప్రపంచ రిజర్వేషన్ వ్యవస్థల అభివృద్ధితో దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఐఆర్సీటీసీని 27 సెప్టెంబరు, 1999న భారతీయ రైల్వేల విస్తృత సేవల విభాగంగా నెలకొల్పారు.