Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ద ఎలిఫెంట్ డ్యాన్సెస్ ఆన్’ అంటూ ఈక్విటీ కో–హెడ్స్ సంజయ్ బెంబాల్కర్ మరియు హార్డిక్ బోరాలు తీర్చిదిద్దిన అత్యంత శక్తివంతమైన మరియు స్పష్టమైన నివేదికలో భారతదేశపు వృద్ధి కథ మరియు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి వెల్లడించారు. సమగ్ర సమాచారంతో తీర్చిదిద్దిన ఈ నివేదికలో రాబోయే ఐదేళ్లు మాత్రమే కాదు, వచ్చే రెండు దశాబ్దాలు ఇండియా వృద్ధికి నిదర్శనంగా నిలువనున్నాయన్నారు. ఈ నివేదికలో, గతంలో అత్యంత అరుదుగా మాత్రమే చేరుకున్న విజయం దిశగా ఇండియా ఏ విధంగా దూసుకుపోతుందనేది వెల్లడించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డాటా ప్రకారం రాబోయే ఐదేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న 9వ దేశంగా ఇండియా నిలువనుంది. ఈ నివేదిక వెల్లడించే దానిప్రకారం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీడీపీ) పర్ క్యాపిటా 2006లో 814 డాలర్లు ఉంటే, 2021లో అది 2280 డాలర్లకు చేరుకుంది. అయినప్పటికీ అగ్రగామి 10 దేశాల జీడీపీ పర్ క్యాపిటా 43,037 డాలర్లతో పోలిస్తే మనం ఎంతో దూరంలో ఉన్నాము. ‘‘గణనీయంగా 55%పైగా జీడీపీ ప్రైవేట్ వినియోగం ద్వారానే వస్తుంది. అందువల్ల, మనం మరిన్ని కార్లను సొంతం చేసుకోవడం, మరింత విద్యుత్ వినియోగించడం, మరింత ఇంటర్నెట్ వినియోగించడం, మరిన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రైవేట్ వినియోగం పెరగడంతో పాటుగా ప్రభుత్వ క్యాపెక్స్ కూడా పెరుగుతుంది. ఇదే ఆర్ధికాభివృద్ధికి ఇంధనం. ఏనుగు నృత్యానికీ కారణం’’ అని సంజయ్ బెంబాల్కర్ అన్నారు.
ఈ నివేదికలో న్యూట్రిషన్, విద్యుత్, క్రెడిట్‌కార్డులు, భీమా, ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, సాఫ్ట్‌డ్రింక్స్ మొదలైన రంగాలలో భారతీయ వినియోగం చూస్తే అగ్రగామి 10 దేశాలతో పోల్చినప్పుడు ఎంతో వెనుకబడి ఉంది. ‘‘ఇండియా మరియు మిగిలిన దేశాల నడుమ అంతరం చాలా త్వరగా కనుమరుగవుతుంది. వృద్ధి దిశగా దేశాన్నీ నడిపిస్తుంది. ఈ కారణం చేతనే మార్కెట్లో స్వల్పకాలిక ఒడిదుడుకులకు కలత చెందడం లేదు. భారతదేశపు దీర్ఘకాలిక లక్ష్యాలపై మేము ఆశాజనకంగా ఉన్నాము’’ అని హార్ధిక్ బోరా అన్నారు. ‘‘సరైన సమయంలో తాము ఇండియాలో పుట్టాము. ఇక్కడి వద్ధి చేత ప్రయోజనమూ పొందుతున్నాము. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, ఏనుగు నడవడం లేదు, పరుగులు పెడుతుంది. దానిమీద సవారీ చేసే అవకాశం అందరికీ ఉంది’’ అని హార్ధిక్ బొరా అన్నారు. యునియన్ ఏఎంసీ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశపు వృద్ధి పట్ల ఆశాజనకంగా ఉంది. తమ మదుపరులకు తగిన విలువను అందించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తుంది.