Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేడు ఫ్లిప్కార్ట్ సమర్ధ్ కృషి ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ వ్యవసాయ సమాజాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్పీఓలు) కు జాతీయ మార్కెట్ అవకాశాలు అందించడంతో పాటుగా తమ వేదిక ద్వారా మరింతగా చర్చల శక్తిని అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. భారతీయ రైతులకు సాధికారితనందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, వ్యవసాయ రంగానికి తోడ్పాటునందిస్తూ ఫ్లిప్కార్ట్ సమర్ధ్ కృషి ప్రోగ్రామ్, మార్కెట్ అవకాశాలను అందించడం తో పాటుగా రైతులకు సామర్ధ్యం సైతం నిర్మించాలని కోరుకుంటుంది. అదనంగా, స్ధిరంగా వారు ఎదిగేందుకు సహాయపడుతూనే, మార్కెట్కు సిద్ధంగా ఉండడానికి మరియు సంబంధితమైన భాగస్వామ్యాల ద్వారా ప్రధాన ఆర్థిక వ్యవస్ధలో భాగం కావడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, రైతులు మరియు ఎఫ్పీఓలకు ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడానికి సాంకేతికత , ఉత్తమ పద్ధతులపై శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి చేస్తారు. ఫ్లిప్కార్ట్ ఇండియాకు పలు పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థలతో చురుకైన భాగస్వామ్యాలు మరియు సహకారాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, బీహార్,గుజరాత్, హర్యానా, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా మరియు పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలలోని వ్యవసాయ శాఖలు ఉన్నాయి. వీటి ద్వారా తమ ఈ–కామర్స్ వేదికపై ఎఫ్పీఓలను చేర్చుకుంటున్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా, ఫ్లిప్కార్ట్ ఇండియా తృణధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు నేరుగా రైతులు మరియు ఎఫ్పీఓల నుంచి సేకరిస్తుంది. తద్వారా స్థానిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్ధలను మెరుగుపరుస్తూనే, భారతదేశ వ్యాప్తంగా వేలాది మంది రైతుల జీవనోపాధిని సైతం మెరుగుపరుస్తుంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పోరేట్ ఆఫీసర్ రజ్నీష్కుమార్ మాట్లాడుతూ ‘‘ రైతులు మరియు ఎఫ్పీఓలు భాగస్వామ్యంతో ఫ్లిప్కార్ట్ ఇండియా యొక్క భాగస్వామ్యం, స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు దేశవ్యాప్త స్ధాయిలో వారి ఉత్పత్తులను అందించడానికి సహాయపడుతుంది. సాంకేతికత, ఆవిష్కరణ, ఈ –కామర్స్ యొక్క శక్తిపై ఆధారపడి ఫ్లిప్కార్ట్ సమర్ధ్ కృషి ప్రోగ్రామ్ , భారతదేశపు సామాజిక–ఆర్ధికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటుగా రైతులు నుంచి వినియోగదారుల వరకూ విలువ చైన్లో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ వ్యవసాయ రంగం మరియు గ్రామీణ సమాజాలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని అన్నారు.
To know more about the Samarth Krishi program, please visit: https://www.youtube.com/watch?v=OhY_jjOpEwI
దాదాపు 100కు పైగా నిత్యావసరాలు అయిన బియ్యం, పప్పులు, హోల్ స్పైసెస్, అటా, మిల్లెట్స్ మొదైలనవి కవర్ చేసే ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూనే, విభిన్నమైన నాణ్యతా ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ఇండియా యొక్క 450 మిలియన్ల మంది వినియోగదారులకు చేరువ చేస్తుంది. 2023 సంవత్సరాంతం నాటికి 2500కు పైగా ఎఫ్పీఓలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా సమర్ధ్ కృషి ప్రోగ్రామ్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో డిజిటల్ పరివర్తనను లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఫ్లిప్కార్ట్ ఇండియా దేశవ్యాప్తంగా పలు ఎఫ్పీఓలతో భాగస్వామ్యం చేసుకుంది. వీటిలో ఏబీవై ఫార్మర్స్, శ్రీ సత్యసాయి మ్యాక్ ఫెడ్, జన జీవన, నిరాలా హెర్బల్, సత్యాద్రి ఫార్మ్స్ సప్లయ్ చైన్ మరియు ఇతరాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఫ్లిప్కార్ట్ ఇండియా 10000కు పైగా రైతులకు ఉత్పత్తి నాణ్యత, ఆహార భద్రతపై శిక్షణ అందించింది. అలాగే వారు తమ మార్కెట్ అవకాశాలను విస్తరించుకునే అవకాశమూ కల్పించింది.