Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సోషల్ మీడియా ద్వారా స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్‌కు పాల్పడిన సాధన బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లపై సెబీ చర్యలకు దిగింది. యూట్యూబర్లతో కుమ్మక్కై తప్పుడు వీడియోలతో అమాయక పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారని గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు అందాయని తెలిపింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడి యోలను అప్లోడ్ చేయడం ద్వారా సాధన బ్రాడ్కాస్ట్ షేర్లను మాని ప్యులేట్ చేశారంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై, అతని భార్య మరి యా గోరెట్టిని స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. బ్రాడ్కాస్ట్ ప్రమోటర్లతో సహా.. 31 యూట్యూబర్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. మానిప్యులేషన్ ద్వారా అర్షద్ వార్సీ రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల లాభం ఆర్జించారని సెబీ గుర్తించింది.