Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ అసెట్ మేనేజ్మెంట్ అంచనా
హైదరాబాద్ : ప్రయివేటు వినిమయం, ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం ద్వారా రాబోయే ఏళ్లలో భారత ఆర్థికాభివృద్థి రేటు పెరగనుందని యూనియన్ ఎస్సెట్ మేనేజ్మెంట్ ఈక్విటీ కో-హెడ్స్ సంజరు బెంబాల్కర్, హార్థిక్ బోరాలు పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాలు ఈ రెండే వృద్థికి ప్రధాన ఇంధనంగా ఉండనున్నాయన్నారు. 55 శాతం పైగా జిడిపి ప్రయివేటు వినియోగం ద్వారానే వస్తుందన్నారు. కార్లను సొంతం చేసుకోవడం, విద్యుత్ వినియోగం, ఇంటర్నెట్ వాడకం ద్వారా ప్రయివేటు, ప్రభుత్వ పెట్టుబడులు పెరగనున్నాయన్నారు.