Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లెవల్ అప్' ప్రోగ్రాం మద్దతు
హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ కోవర్కింగ్ కమ్యూనిటీలలో ఒకటైన 91 స్ప్రింగ్ బోర్డ్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఎఫ్ఎస్) భాగస్వామ్యంలో హైదరాబాద్ నుండి 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతును ఇస్తున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి. తమ 'లెవల్ అప్' ప్రొగ్రామ్ మొదటి గ్రూప్ కోసం వీరిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. ఇది దేశవ్యాప్త వర్చువల్ యాక్సిలరేటర్ ప్రోగ్రామని 91 స్ప్రింగ్ బోర్డ్ తెలిపింది. ఇది మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్లకు నిధులు సమకూర్చ డానికి, వారు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుం దని పేర్కొంది. ఈ మహిళా పారిశ్రామికవేత్తలు ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణం, సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్, రవాణా, ఇతర పరిశ్రమల రంగాలలో టెక్ వ్యాపారాలను నడుపుతున్నారని 91 స్ప్రింగ్ బోర్డ్ సీఈఓ ఆనంద్ వేమూరి తెలిపారు.