Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ హబ్‌లో హెచ్ఆర్ ఇండియా సదస్సులో వక్తలు
హైదరాబాద్ : ఉద్యోగార్ధులు, వ్యాపార సంస్ధల కోసం ఏఐ ఆధారిత అంతర్జాతీయ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా వెలుగొందుతున్న టెక్‌ఫైండర్ హెచ్ఆర్ ఇండియా సదస్సును హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో నిర్వహించింది. టీ-హబ్ సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి ఈ సదస్సును ప్రారంభించడంతో పాటు రాబోయే మాంద్యం, లేఆఫ్స్ , హెచ్ఆర్ లీడర్లు, కంపెనీలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వెల్లడించారు.
ఎర్నెస్ట్ అండ్ యంగ్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మి కనక హాజరైన అభ్యర్ధుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రతిభావంతులను నియమించుకునే సమయం లో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను గురించి తన అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. అనంతరం 2023లో ఉద్యోగ నియామకాల పరంగా ఎదురయ్యే సవాళ్లను గురించి, వ్యాపారాలు ముందుకు దూసుకు పోవడంలో ఏ విధంగా సాంకేతికత స్ధిరమైన అవకాశాలను అందించగల వనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.
ఈ చర్చకు మోడరేటర్‌గా అంతర్జాతీయ స్పీకర్ పార్వతి వ్యవహరిం చగా, ఎర్నెస్ట్ అండ్ యంగ్‌కు చెందిన పాలగుమ్మి లక్ష్మి కనక, స్కై కంప్యూటింగ్‌కు చెందిన అఫ్రా, అహ్మద్ అమెర్బీ బ్రెయిన్ స్ట్రోమ్ నుంచి రాజీవ్ కచర , స్మితాస్ గ్రూప్ నుంచి సచిన్ మల్హొత్రా, టెక్ ఫైండర్ నుంచి పౌల్ గై పాల్గొన్నారు.
''అంతర్జాతీయ డాటా కార్పోరేషన్ (ఐడీసీ) చెప్పే దాని ప్రకారం, భారతదేశంలో ఏఐ పరిశ్రమ 20.2% సీఏజీఆర్‌తో 2025 నాటికి 7.8 బిలియన్ డాలర్లుగా నిలుస్తుందని అంచనా. ఈ సునామీ మార్పును హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు గుర్తించలేదు. హెచ్ఆర్ వృత్తి, ప్రాక్టీషనర్ల నడు మ ఏఐ అప్లికేషన్లు అమితాదరణ పొందుతున్నాయి. ప్రతిభావంతులను సొంతం చేసుకోవడమనేది సాంకేతికాధారిత హెచ్ఆర్ కార్యక్రమంగా మారింది. వ్యాపారాలలో ఏఐ వినియోగం పెరుగుతుండటానికి ఓ ఉదాహ రణగా నియామక నిర్ణయాలను తీసుకోవడం నిలుస్తుంది'' అని గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పౌల్ గై అన్నారు.