Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శామ్సంగ్ వారి అత్యంత ఇటీవలి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ సీరీస్ అయిన గెలాక్సీ S23 సీరీస్, ఫిబ్రవరి 24, 2023 నుండి అమ్మకానికి వెళుతోంది. గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ S23+ మరియు గెలాక్సీ S23 ఉపకరణాలు గణనీయంగా అతితక్కువ పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉండి అత్యుత్తమ శ్రేణి వినూత్న పరిజ్ఞానముతో ఈ తరానికి సంబంధించిన నవ్యతతో ఉన్నాయి. కొత్త గెలాక్సీ S23 సీరీస్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు నేటి నుండి వాటిని Samsung.com మరియు ఎంపిక చేయబడిన రిటెయిల్ ఔట్లెట్ల నుండి కొనుగోలు చేసుకోవచ్చు. గెలాక్సీ S23 అల్ట్రా, ఐతిహాసిక సునిశితత్వంతో చిత్రాలను గ్రాహ్యత చేసుకోగల అడాప్టివ్ పిక్సెల్స్ తో సరికొత్త 200MP సెన్సార్ తో వస్తుంది. సూపర్ క్వాడ్ పిక్సెల్ AF తో, వెనుకవైపు కెమెరా 50% వేగంగా ఫోకస్ చేయగలుగుతుంది. గెలాక్సీ S23 సీరీస్ పై ఫ్రంట్ కెమెరా ఇప్పుడు నైటోగ్రఫీతో పాటుగా డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ టెక్నాలజీతో వస్తుంది, అది తక్కువ లైటింగ్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఫ్రంట్ కెమెరా నుండి షూటింగ్ చేసుకునే వీలు కలిగిస్తుంది. డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ టెక్నాలజీ, ముందువైపు కెమెరా నుండి 60% వేగవంతమైన ఫోకస్ ఉండేలా కూడా చూసుకుంటుంది. గెలాక్సీ S23 సీరీస్ పైన వీడియోలు, సూపర్ HDR తో మరింత సినిమాటిక్‌గా, పెంపొందిత ధ్వని నియంత్రణ అల్గారిధంతో మరియు 2X వెడల్పైన OIS తో రాత్రివేళల్లో మృదువైన మరియు పదునైన ఔట్పుట్ అందిస్తాయి. గెలాక్సీ ప్రపంచపు అత్యంత వేగమైన మొబైల్ గ్రాఫిక్స్ అందజేసేలా గెలాక్సీ S23 సీరీస్, కస్టమ్ డిజైన్ చేయబడిన స్నాప్‌డ్రాగన్® 8 జెన్ 2 మొబైల్ ప్లాట్ఫారముతో వస్తాయి. విశ్వసనీయమైన గేమింగ్ పనితీరు కోసం గెలాక్సీ S23 సీరీస్, 2.7x పెద్దదైన వేపర్ కూలింగ్ ఛాంబరుతో వస్తుంది. గెలాక్సీ S23 అల్ట్రా, మొబైల్ గేమింగ్ని సార్వత్రికం చేయడానికి వస్తోంది కాబట్టి ఇది వాస్తవ సమయపు రే-ట్రేసింగ్ కు మద్దతునిస్తుంది. వాడుకదారులు దృశ్యాల అందజేతలను ప్రతి కాంతి కిరణమూ అనుకరించి అనుసరించే టెక్నాలజీతో మరింత జీవం ఉట్టిపడినట్లు గమనిస్తూ చూడగలిగి ఉంటారు. ఇండియాలో అమ్మబడే గెలాక్సీ S23 స్మార్ట్ ఫోన్లు అన్నీ కంపెనీ యొక్క నోయిడా కర్మాగారములో తయారు చేయబడుతున్నాయి. 'భారత్-లో-తయారీ' గెలాక్సీ S23 స్మార్ట్ ఫోన్లను అమ్మాలనే శామ్సంగ్ యొక్క నిర్ణయం, భారతదేశపు తయారీ మరియు ఎదుగుదల కథనానికి కంపెనీ యొక్క నిబద్ధతను చూపిస్తోంది.