Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ విద్యుత్ బైకుల తయారీ కోసం అమెరికాకు చెందిన జీరో మోటర్సైకిల్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఇవి మోటార్ సైకిళ్లను తయారు చేయనున్నాయి. ఇవి బైకుల తయారీలో జీరో మోటార్ సైకిల్ హీరోకు సహకారం అందించనుంది. ప్రపంచలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీ కంపెనీ జీరోతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని హీరో మోటో ఛైర్మన్, సిఇఒ పవన్ ముంజల్ పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్లో జీరో మోటార్సైకిల్స్ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది.