Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేక సంవత్సరాలుగా తమ కార్యాలయాలు మరింత వైవిధ్యంగా ఇంకా సమ్మిళితమైనవిగా (డీ&ఐ) ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆ విధానానికి కట్టుబడి, కంపెనీలో మహిళా ఉద్యోగులకు సాధికారత అందించాలనే లక్ష్యంతో ‘షీ లీడ్స్’ (SHE Leads) కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ‘అవుట్‌సైడ్-ఇన్’ దృక్పథాన్ని నెలకొల్పే దిశగా, క్రాస్-ఫంక్షనల్ అభ్యాసాన్ని ప్రోత్సహించేలా ఒకరికొకరు మద్దతుగా నిలబడే సంస్కృతిని నెలకొల్పడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. వివిధ విభాగాలకు చెందిన 150 మందికి పైగా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తూ ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ‘షీ లీడ్స్’ రెండో సీజన్ ముగిసింది. ఈ 6 వారాల ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారంతా ఏదో ఒక మంచి విషయాన్ని అలవాటు చేసుకున్నారు. అటు కార్పొరేట్ ఇటు వ్యక్తిగత జీవితాల్లో తమకు సవాళ్లు ఎదురైనప్పుడు మరింత ఆలోచనాపూర్వకంగా, స్థిరంగా, జాగృతంగా వ్యవహరించడంలో అవి వారికి తోడ్పడుతున్నాయి. తాము ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులు తలెత్తినప్పుడు నిస్సహాయతకు లోను కాకుండా ధైర్యంగా ఎదుర్కొనగలుగుతున్నామని ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారు తెలిపారు. డీ&ఐ ప్రాధాన్యతల్లో భాగంగా లింగ భిన్నత్వానికి కంపెనీ పెద్ద పీట వేస్తోంది. కంపెనీలో మరింత మంది మహిళలు ఉండటం మాత్రమే లక్ష్యం కాకుండా మేనేజర్ల స్థాయిలో మరింత మంది మహిళలు ఉండేలా కృషి చేయాలని నిర్దేశించుకుంది. దీనిపై ఫ్యుచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, సీహెచ్ఆర్వో Ms. రీనా త్యాగి మాట్లాడుతూ, “ఒకే తరహా అడ్డంకులను అధిగమించిన లీడర్లతో కనెక్ట్ అయ్యేందుకు, వారి నుంచి నేర్చుకునేందుకు మహిళా ఉద్యోగుల కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తమ ఎదుగుదలకు, అభివృద్ధికి ఉపయోగపడే కీలకమైన అంశాల గురించి వారు నేర్చుకునేందుకు, వాస్తవిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సహాయం అందించాలన్నది మా ఉద్దేశం. మా ప్రతి ప్రోగ్రామ్, అలాగే విధానాలు ఫ్యుచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాల్లో నిజమైన భిన్నత్వాన్ని, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో మేము చేపట్టిన ‘షీ లీడ్స్’ వంటి కార్యక్రమాలు సంస్కృతిపరమైన, శాశ్వతమైన మార్పులు తీసుకురాగలవని ఆశిస్తున్నాము” అని పేర్కొన్నారు. ‘షీ లీడ్స్’లో పాల్గొన్న వారిలో 24 శాతం మందికి పైగా మహిళా ఉద్యోగులు తమ అప్రైజల్ క్రమంలో ప్రమోషన్ పొందడం ఈ ప్రోగ్రామ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, మొత్తం మహిళా ఉద్యోగుల సగటుతో పోలిస్తే ‘షీ లీడ్స్’లో పాలుపంచుకున్న వారి రిటెన్షన్ రేటు 8 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. తమపై కంపెనీ చేసే ఇన్వెస్ట్మెంట్ మీద వారికి ఉన్న నమ్మకానికి ఈ ప్రోగ్రామ్ నిదర్శనం. మహిళా లీడర్లను తీర్చిదిద్దే దిశగా ఇలాంటి కార్యక్రమాలను ఇకపైనా మరిన్ని ఆవిష్కరించాలని కంపెనీ నిర్దేశించుకుంది. ఆ దిశగానే చేపడుతున్నదే ‘వండర్ ఉమెన్’ ప్రోగ్రామ్. ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విజేతలైన మహిళలు, విజయవంతమైన కెరియర్ను నిర్మించుకోవడం, దాన్ని కమ్యూనిటీతో పంచుకోవడానికి సంబంధించి వారు సాగించే స్ఫూర్తిదాయకమైన ప్రయాణమే దీని ఇతివృత్తం. మొత్తంమీద ఈ రెండు ప్రయత్నాలూ ఫ్యూచర్ జనరలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మహిళా ఉద్యోగులకు సాధికారత కల్పించేందుకు తోడ్పడనున్నాయి.